»   » బొమ్మరిల్లు భాస్కర్ చివరకు అలా....

బొమ్మరిల్లు భాస్కర్ చివరకు అలా....

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : బొమ్మరిల్లు చిత్రంతో తానేంటో ప్రూవ్ చేసుకున్న తమిళ దర్శకుడు భాస్కర్. ఆయన ఇంటిపేరుగా మారేంత విజయాన్ని ఆ చిత్రం ఇచ్చింది. ఆ తర్వాత ఆయన అల్లు అర్జున్ తో పరుగు చిత్రం చేసారు. అది ఓకే అనిపించుకుంది. సరే అని రామ్ చరణ్ తో ఆరెంజ్ చిత్రం చేస్తే అది పూర్తిగా చీదేసింది. ఇవన్నీ కాదు అని ...రామ్ హీరోగా ఒంగోలు గిత్త చిత్రం డైరక్ట్ చేస్తే...మొత్తం పెట్టే బేడా సర్దుకునేలా చేసింది. ఈ నేపధ్యంలో ఆయన ఓ రీమేక్ కు చేసే ఆఫర్ వచ్చింది. అది మరేదో కాదు బెంగుళూరు డేస్.

'బెంగుళూరు డేస్' మలయాళంలో ఇటీవలే విడుదలై సూపర్ హిట్ అయ్యింది. గత కొద్ది రోజుల క్రితం ప్రముఖ నిర్మాతలైన పివిపి మరియు దిల్ రాజు కలిసి ఈమళయాళ సినిమా రైట్స్ తీసుకున్నారు. ఈ తెలుగులో రీమేక్ లో ముగ్గురు హీరోలు ఉంటారు. సమంత హీరోయిన్ గా చేస్తుంది.

నిర్మాతగా దిల్ రాజు చిత్రాలకు ప్రేక్షకులల్లోనూ, డిస్ట్రిబ్యూటర్స్ లోనూ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. కథా బలం ఉన్న చిత్రాలకు, భావోద్వేగ ప్రధాన కథలకు ఆయన ఓటేస్తారని నమ్ముతూంటారు. ప్రస్తుతం అదే వరసలో మరో చిత్రానికి శ్రీకారం చుడుతున్నట్లు సమాచారం.

Bommarillu Bhaskar with Re-make?

ఎన్టీఆర్, సావిత్రి కాంబినేషన్ లో వచ్చి సూపర్ హిట్టైన చిత్రం కలిసి ఉంటే కలదు సుఖం. ఈ టైటిల్ తో ఇప్పుడు మరో చిత్రం రూపొందుతోంది. దిల్ రాజు నిర్మాతగా వేణు శ్రీరామ్(ఓ మై ప్రెండ్) దర్శకుడుగా రూపొందుతోంది. అల్లు అర్జున్ కానీ నితిన్ కానీ ఈ చిత్రంలో నటించే అవకాసం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ చిత్రానికి స్క్రిప్టు వర్క్ పూర్తైందని, ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా చిత్రాన్ని రూపొందించనున్నారని సమాచారం. త్వరలోనే ఈ చిత్రం పట్టాలు ఎక్కుతోందని తెలుస్తోంది. ఈ మేరకు ఏర్పాట్లు మొదలయ్యాయని అంటున్నారు.

దిల్ రాజు నిర్మించే ఈ చిత్రం ఓ లవ్ స్టోరీగా ఉండనుందని,వైవిధ్యమైన స్క్రీన్ ప్లే తో వేణు శ్రీరామ్ కథనాన్ని తయారు చేసాడని చెప్తున్నారు. ఈ మేరకు గత కొంతకాలంగా వేణు ఈ స్క్రిప్టుపైనే కుస్తీలు పడుతున్నారు. లైన్ ఓకే చేసిన బన్ని రీసెంట్ గా పూర్తి స్క్రిప్టు విన్నారని, తెలుస్తోంది. త్రివిక్రమ్ తో చేయనున్న ప్రాజెక్టు అనంతరం ఈ ప్రాజెక్టు పట్టాలు ఎక్కనుంది. వేణు శ్రీరామ్ ప్రస్తుతం దిల్ రాజు నిర్మిస్తున్న కేరింత చిత్రంకి సహాయం చేస్తున్నారు.

English summary
‘Bommarillu’ Bhaskar is all set to direct his next which is a re-make of Malayalam hit ‘Bangalore Days’. Buzz is the film will be produced by PVP and Dil Raju together. Official confirmation is expected anytime.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu