స్టార్ హీరోలను సెటైర్ చేస్తూ బ్రహ్మానందం
మగధీర,శక్తి,బద్రీనాధ్,రోబో వంటి మెగా బడ్జెట్ సినిమాలను,స్టార్ హీరోలను త్వరలో బ్ర్హహ్మానందం సెటైర్ చేయనున్నాడు. బ్రహ్మానందం సోలో హీరోగా రూపొందే ఓ చిత్రం కోసం ఈ సినిమాల పేరడీలన్నిటినీ కలిపి వాడనున్నారని ఫిల్మ్ నగర్ సమాచారం.ఓ కొత్త దర్శకుడు ఓ విభిన్నమైన స్క్రిప్టుతో బ్రహ్మానందంను బేస్ చేసుకుని కథ అల్లి కలిసాడని,వెంటనే బ్రహ్మానదంకి డేట్స్ ఇస్తానని చెప్పటం జరిగిపోయాయట.అయితే బ్రహ్మానందం ఆ స్టిల్స్ ని సినిమా విడుదల దాకా రహస్యంగా ఉంచాలని కండీషన్ పెట్టాడని చెప్పుకుంటున్నారు.ఇక ఈ చిత్రం చేస్తే తర్వాత పెద్ద హీరోల దగ్గర తనకు ఏమన్నా సమస్యలు వస్తాయా అన్న కోణంలో కూడా బ్రహ్మానందం ఆలోచించి ముందుగానే ఓ మాట చెప్పి ఈ సినిమా చేయాలని నిర్ణయించుకున్నాడని చెప్తున్నారు.ఇక ఆ మధ్య అప్పలరాజులో తెలుగులో దర్శకులందరినీ వెటకారం చేస్తూ రామ్ గోపాల్ వర్మ పాట పెట్టినట్లు బ్రహ్మానందం తెలుగు హీరోలను వెటకారం చేస్తూ సినిమా చేసి నవ్విస్తాడన్నమాట.


Click it and Unblock the Notifications











