»   » మగాళ్ళ పై మండిపడుతూ..ఆడవాళ్ళకి సోపేస్తున్న బ్రహ్మీ!

మగాళ్ళ పై మండిపడుతూ..ఆడవాళ్ళకి సోపేస్తున్న బ్రహ్మీ!

Posted By:
Subscribe to Filmibeat Telugu

బ్రహ్మానందం గురించి తెలిసినవారెవరూ..ఆయన గురించి మంచి చెప్పిన పాపాన పోరు. మగవారిని, ఆడవారిని వేరువేరుగా చూడటం బ్రహ్మానందానికి కొట్టిన పిండని ముఖం మీదే చెప్పేసి వెళుతుంటారు. బ్రహ్మానందాన్ని మగవారు పలుకరిస్తే..నొసలు చిట్లించో..ముభావంగానో ఉండిపోతాడట. అదే ఆడవారు..అందులోనూ కొంచెం వయస్సులో ఉన్నవాళ్లు పలకరిస్తే..చిరునవ్వుతో ఎంతోకాలం నుంచి పరిచయం ఉన్నట్లు చాలాసేపు వదలకుండా.. వాళ్లు ఇక చాలు వదులు బాబోయ్ అన్నంతవరకూ మాట్లాడుతూనే ఉంటాటడట.

కొత్త, పాత తేడా లేకుండా ఆడవారితో చాలా చనువుగా ఉంటాడనీ, అదే మగవారైతే.. అంటీ అంటనట్లుగా ఉంటూ తప్పించుక తిరుగుతాడని టాలీవుడ్ సినీజనం టాక్. ఏమిటీ వైఖరి? లింగవివక్షతా లేక ఇదేమైనా వీక్‌నెస్సా?! అని చాలామంది తీవ్రంగా ఆలోచిస్తున్నారట. అన్నట్లు బ్రహ్మానందానికి పద్మశ్రీ బిరుదు వచ్చాక అది మరింత ముదిరి తల బిరుసు పెరిగిందని అంటున్నారు. దీనికి నిదర్శనంగా మొన్నామద్య ఇవివి సత్యనారాయణ తెరకెక్కిస్తున్న 'బురిడి" చిత్రం ప్రేక్షకుల మాట ఏమో కానీ, సినిమాలకు సగం హీరో నేనే అనుకునే హాస్య బ్రహ్మా..బ్రహ్మానందానికి మాత్రం ఆగ్రహాన్ని తెప్పించింది ఏవిధంగా అనుకుంటున్నారా? చెబితే మీరు కూడా ఆశ్చర్య పోవడంతో పాటు అతని నిజమైన క్యారెక్టర్ ను తెలుసుకుంటారు. తనతో కలిసి ఎక్కువగా నటించే నటి హేమ. ఈ సినిమాలో సుమన్ శెట్టితో బాగా రాసుకుని తిరిగే సీన్స్ ఉండటంతో ఆ సీన్స్ దగ్గరుండి చూస్తున్న బ్రహ్మీ తట్టుకోక పోతున్నాడని సమాచారం. ఈ చిత్రంలో సుమన్ శెట్టి హేమను ఎత్తుకుని తిరిగే సన్నివేశంలో హేమ చక్కగా సహకరించడం చూస్తున్న బ్రహ్మీ మొహాన్ని అక్కడున్న వారందరూ పరిశీలించారట. సో అక్కడున్న వారంతా నిజమైన బ్రహ్మీ క్యారెక్టర్ ను చూశామంటున్నారని సమాచారం. అసలే మంచి రసికుడు అని అప్పట్లో పేరు తెచ్చుకున్న బ్రహ్మీ హేమ అంటే పడిచస్తాడట..అందుకు సినిమాలో కావాలని మరి తన ప్కక్కన హేమను ఉంచాలని దర్శకనిర్మాతలను కోరతాడని కూడా సమాచారం.

గతంలో బ్రహ్మీ గెస్ట్ హౌస్ పై పోలీసులు దాడి చేసి అతన్ని కొంతమంది లేడిస్ తో ఉండగా పట్టుకున్న విషయం తెలిసిందే..అప్పుడే బ్రహ్మీ ఖతర్నాక్ అనుకున్నారు కానీ మరీ ఇంత అనుకోలేదు..ప్రస్తుత సన్నివేశం చూసిన వారు అతని క్యారెక్టర్ ఈ రేంజ్ లో ఉంటుందా! అనుకుంటున్నారు. ప్రస్తుతం హేమ పై తనకున్న వాంఛను క్లియర్ గా బట్ట బయలు చేసింది..బురిడి చిత్ర షూటింగ్ అంటున్నారు విమర్శకులు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu