»   » తమ్ముడు శిరీష్ కోసం అల్లు అర్జున్ ఆ మాత్రం చెయ్యాల్సిందే

తమ్ముడు శిరీష్ కోసం అల్లు అర్జున్ ఆ మాత్రం చెయ్యాల్సిందే

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రాజెక్టుకు క్రేజ్ తేవాలంటే ఏదో ఒక మ్యాజిక్ ఉండాలి. జనం మాట్లాడుకునే మ్యాటర్ ఖచ్చితంగా ఉండాలి. ఈ విషయం నిర్మాత కుటుంబం నుంచి వచ్చిన అల్లు అర్జున్ కు బాగా తెలుసు. అందుకే తన తమ్ముడు అల్లు శిరీష్ తదుపరి చిత్రంలో స్పెషల్ అప్పీరియన్స్ ఇవ్వటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. నిజమే అయితే ఇంకా పేరు పెట్టని ఆ సినిమాకు ఖచ్చితంగా క్రేజ్ వస్తుంది.

ఇక తన తమ్ముడు శిరీష్ కోసం మాత్రమే కాకుండా దర్శకుడు వేణు మల్లిడి మీద ఉన్న అభిమానంతో ఇలా స్పెషల్ అప్పీరియన్స్ కు ఓకే చేసినట్లు తెలుస్తోంది. మల్లిడి వేణు తండ్రి మల్లిడి సత్యనారాయణ రెడ్డి నిర్మాతగా అల్లు అర్జున్ ప్రారంభ రోజుల్లో వివి వినాయిక్ దర్శకత్వంలో బన్ని చిత్రం వచ్చింది. అప్పటినుంచే అల్లు అర్జున్ కు ఆ కుటుంబంతో మంచి రాపో ఉంది.

నమ్మలేని నిజం : మెగా ఫ్యామిలీనుంచి వరస పెట్టి 16 సినిమాలు,డిటేల్స్

అల్లు బ్రదర్స్ ఇద్దరూ కూడా తొలిసారి తెరపై కనపడతారు కాబట్టి..ఖచ్చితంగా స్పెషల్ కేర్ దర్శకుడు తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. శ్రీ శైలేంద్ర ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై ఎస్‌.శైలేంద్రబాబు, కె.వి.శ్రీధర్‌ రెడ్డి, హరీష్‌ దుగ్గిశెట్టి నిర్మాతలుగా ఈ చిత్రం రూపొందుతోంది.

Bunny special appearance in Sirish's forthcoming film?

అల్లు శిరీష్‌ మాట్లాడుతూ ''శైలేంద్ర ప్రొడక్షన్స్‌ బ్యానర్‌ వారికిది తెలుగులో రెండో చిత్రం కాగా, నాకు నాల్గవ చిత్రం. చిత్ర దర్శకుడు ఎం.వి.ఎన్‌. తండ్రి మల్లిడి సత్యనారాయణగారు అన్నయ్యతో 'బన్ని' సినిమాను నిర్మించారు. నాకు డైరెక్టర్‌తో చిన్నప్పటి నుంచి పరిచయం ఉంది. చాలా సినిమాలకు కో డైరెక్టర్‌గా, అసోసియేట్‌ డైరెక్టర్‌గా పని చేశారు. ఇప్పుడు నా సినిమాతో దర్శకుడిగా మారుతున్నారు.

ఈ చిత్రానికి సంజరు లోక్‌ నాథ్‌ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, జిబ్రాన్‌ మ్యూజిక్‌ అందిస్తున్నాడు. ప్రస్తుతం లోకేషన్స్‌ చూస్తున్నారు. డైలాగ్‌ వెర్షన్‌ వర్క్‌ జరుగుతుంది. ప్రతి సంవత్సరం 20-30 కథలు వింటుంటాను. కానీ ఈ కథను సింగిల్‌ సిటింగ్‌లోనే ఓకే చేసేశాను. నాన్నగారు కూడా కథను సింగిల్‌ సిట్టింగ్‌లోనే ఓకే చేసేశారు.

లవ్‌ ఎంటర్‌ టైనర్‌, 700 సంవత్సరాల పీరియాడిక్‌ బ్యాక్‌ డ్రాప్‌ కూడా ఉంటుంది. అన్నీ కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ఉండే చిత్రం. ఈ సినిమా కోసం వర్కవుట్‌ చేయాలి. 'శ్రీరస్తు శుభమస్తు' రిలీజ్ తర్వాత ఈ సినిమా సెట్స్‌లోకి వెళుతుంది. ఇలాంటి రోల్‌ చేయాలని ఏడాది పాటు వెయిట్‌ చేశాను. కామెడీ, పెర్‌ఫార్మెన్స్‌ కలగలిసిన క్యారెక్టర్‌'' అని అన్నారు.

English summary
Allu Arjun has reportedly given his nod to be seen in a special appearance in Sirish's forthcoming film. The yet-to-be-titled film will be directed by Malladi Venu.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu