»   » చైతూ 'ప్రేమమ్' దర్శకుడు నెక్ట్స్ ఖరారు, హీరో ఎవరంటే..

చైతూ 'ప్రేమమ్' దర్శకుడు నెక్ట్స్ ఖరారు, హీరో ఎవరంటే..

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నాగచైతన్యతో చేసిన 'ప్రేమమ్' చిత్రం మంచి విజయం సాధించటంతో దర్శకుడు చందు మొండేటికి వరసపెట్టి ఇండస్ట్రీ నుంచి ఆఫర్స్ వచ్చాయి. అయితే అందతున్న సమాచారం ప్రకారం రీసెంట్ గా ఓ స్టార్ హీరోతో కథను ఓకే చేయించుకున్నట్లు తెలసింది. ఆ హీరో మరెవరో కాదు.. మాస్ మహారాజ రవితేజ.

రీసెంట్ గా అనేక ప్రాజెక్టులు వరస పెట్టి చివరి నిముషాల్లో కాన్సిల్ చేసిన రవితేజ...ఈ దర్శకుడుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. రీసెంట్ గా రవితేజకు ఫైనల్ వెర్షన్ కథని వినిపించిన చందు మొండేటి..చిన్న చిన్న మార్పులతో స్క్రిప్టు ఓకే చేయించుకున్నట్లు తెలుస్తోంది. అన్ని అనుకున్నవి అనుకున్నట్లు జరిగితే త్వరలోనే ఈ ప్రాజెక్టు పట్టాలు ఎక్కనుంది.

Chandoo Mondeti to direct Ravi Teja

ఇక ఈ చిత్రం చందు మొండేటి తొలి చిత్రం కార్తికేయ తరహాలో సూపర్ నాచురల్ ఎలిమెంట్స్ తో సాగనుందని తెలుస్తోంది. ఆ అంశాలకు మాస్ ఎలిమెంట్స్ మిక్స్ చేయటంతో రవితేజకు నచ్చేసిందని, రవితేజ కెరీర్ లో ఇది కొత్తతరహా జానర్ అవుతుందని అంటున్నారు.

ఇక ఒకప్పుడు ఏడాదికి మూడు నాలుగు సినిమాలు రిలీజ్ చేసిన మాస్ మహరాజ్ రవితేజ, గత ఏడాది కాలంగా ఒక్క సినిమా కూడా సైన్ చేయకపోవటం ఆయన అబిమానులను నిరాశలో ముంచేస్తోంది. ఈ గ్యాప్ లో ఒకటి రెండు సినిమాల ఎనౌన్స్ మెంట్ వచ్చినా అవి సెట్స్ మీదకు రాలేదు. దీంతో మాస్ మహరాజ్ అభిమానులు కొద్ది రోజులు గా కొత్త సినిమా ఎనౌన్స్ మెంట్ కోసం ఎదురుచూస్తున్నారు.

Chandoo Mondeti to direct Ravi Teja

చందు మొండేటి మాట్లాడుతూ.... నాగార్జునగారికి రెండు కథలు రెడీ చేశా. ఐ డ్రీమ్ ప్రొడక్షన్‌లో, 'దిల్' రాజుగారి బ్యానర్లో, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌లో చిత్రాలు చర్చల దశలో ఉన్నాయి అన్నారు.

English summary
Ravi Teja, who was supposed to work with a few other directors, has cancelled those projects last minute for different reasons and has given a green signal to Chandoo.T have criticised Ravi Teja for not doing a project for long but the actor is hell-bent on going only with a good script which he has finally found with Chandoo. “The subject deals with the supernatural like the director’s earlier film Karthikeya,” reveals the source.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X