»   » హాస్పటల్ లో చిరంజీవి...సర్జరీ ?

హాస్పటల్ లో చిరంజీవి...సర్జరీ ?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రాహుల్ గాంధీ అనంతపూర్ టూర్ కు వ్చచినప్పుడు చిరంజీవి ఆబ్సెంట్ అయ్యారు. అయితే ఆయన కాంగ్రేస్ నుంచి వీడిపోవటానికే ప్లాన్ చేసుకుని ఇలా చేసారంటూ రూమర్స్ వచ్చాయి. అయితే నిజం వేరే విధంగా ఉందని సమాచారం.

చిరంజీవి..రీసెంట్ గా...ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పటిల్ లో చేరారని తెలుస్తోంది. చిరు తన భుజానికి సంబంధించి సర్జరీ చేయించు కున్నట్లు తెలుస్తోంది. డాక్టర్స్ సలహా మేరకు దాదాపు ఒక వారం విశ్రాంతి తరువాత చిరంజీవి ఫిబ్రవరి రెండవ వారంలో హైదరాబాద్ కు తిరిగి వస్తాడని తెలుస్తోంది.

చిరంజీవి సర్జరీ వార్తలు ఎంత వరకు నిజమో కానీ మెగా అభిమానులు మాత్రం ఆందోళన పడుతున్నారు. చిరంజీవి నిన్న జరిగిన రాహుల్ గాంధీ అనంతపురం టూర్ లో కనిపించక పోవడమే కాకుండా నిన్న జరిగిన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలలో ఓటు వేయడానికి రాలేదని తెలుస్తోంది.

Chirajeevi Admitted In Hospital For Surgery

ఇక ఇదిలా ఉంటే... 'కత్తి' రీమేక్ విషయంలో చిరంజీవి పూర్తి దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. 'కత్తి' ఒరిజనల్ స్టోరీ తనదే అంటూ రచయిత నరసింహారావు ఇచ్చిన కంప్లైంట్ విషయమై సొల్యూషన్.. వెతకడానికి మార్గం అన్వేషించ వలసిందిగా రచయితలు పరుచూరి బ్రదర్స్ ను రంగంలోకి దింపినట్లు వార్తలు వస్తున్నాయి.

వీరి మధ్యవర్తిత్వంతో ఈ సమస్యకు ఒక పరిష్కారం త్వరలో లభిస్తే వెంటనే 'కత్తి' రీమేక్ షూటింగ్ ను ప్రారంభించాలని చిరంజీవి చాల గట్టి పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే చిరంజీవికి జరిగిన ఈ సర్జరీ వల్ల 'కత్తి' రీమేక్ షూటింగ్ ప్రారంభం మరి కొద్ది కాలం ఆలస్యం అయినా ఆశ్చర్యం లేదు అని అంటున్నాయి ఫిలింనగర్ వర్గాలు..

English summary
Chiranjeevi is admitted to Breach Candy hospital in Mumbai for a surgery to his shoulder.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu