కుర్ర హీరోతో కలర్స్ స్వాతి ఎఫైరా?

'కార్తికేయ' విషయానికి వస్తే...నిఖిల్, స్వాతి జంటగా నటించిన చిత్రం 'కార్తికేయ'. చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. వెంకట శ్రీనివాస్ బొగ్గరం నిర్మాత. ఒక పాట మినహా చిత్రీకరణ పూర్తయింది. వచ్చే నెల మొదటి వారంలో గీతాల్ని విడుదల చేస్తారు. ఈ చిత్రంపై ట్రేడ్ వర్గాల్లో మంచి క్రేజ్ వచ్చింది. చిత్రం ట్రైలర్ కూడా ఆసక్తి పుట్టించే విధంగా ఉండటంతో అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
దర్శకుడు మాట్లాడుతూ ''సమాధానం దొరకని ప్రశ్నంటూ ఏదీ లేదని నమ్మిన ఓ యువకుడి కథ ఇది. అతనికీ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికీ సంబంధమేమిటన్నది తెరపైనే చూడాలి. ప్రేమ, వినోదం, థ్రిల్లర్ అంశాల మేళవింపుతో ఈ చిత్రం సాగుతుంది'' అన్నారు. మార్చి చివరి వారంలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామన్నారు నిర్మాత. తనికెళ్ళ భరణి, రావు రమేష్, కిశోర్, రాజా రవీంద్ర, జయప్రకాష్, తులసి తదితరులు నటించారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: కార్తీక్ ఘట్టమనేని, కూర్పు: కార్తీక శ్రీనివాస్, సంగీతం: శేఖర్ చంద్ర.
ఇక కలర్స్ స్వాతి నటించిన బంగారు కోటి పెట్ట చిత్రం సైతం విడుదలకు సిద్దమవుతోంది. నవదీప్, కలర్స్ స్వాతి కాంబినేష్ లో రూపొందుతున్న చిత్రం 'బంగారు కోడి పెట్ట'. బోణి ఫేమ్ రాజ్ ఫిప్పళ్ళ ఈ చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నారు. చాలా కాలం క్రితమే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 27న విడుదల కాబోతోంది. ఈ మేరకు సెన్సార్ ను డిసెంబర్ లోనే పూర్తి చేసి,పబ్లిసిటీ కాంపైన్ ప్రారంభించారు. U/A సర్టిఫికేట్ ని అందుకున్న ఈ చిత్రం ఎంటర్టైన్మెంట్ ప్రధానంగా నడుస్తుందని చెప్తున్నారు. ఈ చిత్రాన్ని సునీత ధాటే నిర్మిస్తోంది. ఆమె తన గురు ఫిలిమ్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది


Click it and Unblock the Notifications











