»   » బాలిలో సిద్ధార్థ్‌తో ఏకాంతంగా గడిపిన దీపికా పదుకొనే..!

బాలిలో సిద్ధార్థ్‌తో ఏకాంతంగా గడిపిన దీపికా పదుకొనే..!

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ సెక్సీ భామ 'దీపికా పదుకొనే' మరియు ప్రముఖ వ్యాపారవేత్త విజయ మాల్యా తనయుడు 'సిద్ధార్థ్ మాల్యా'కు మధ్య ఉన్న సంబంధం గురించి సినీ జనాలు ఇప్పటికే కధలు కధలుగా చెప్పుకుంటుంటే.. వారి వాదనలకు మరింత బలాన్ని చేకూరుస్తూ ఈ ఇద్దరు ప్రేమ పావురాలు 'బాలి' ద్వీపంలో ఎగురుతూ దర్శనమిచ్చాయి. దీపికా దగ్గరి మిత్రుల సమాచారం ప్రకారం, దీపికకు లండన్‌లో బిజీ షెడ్యూల్ షూటింగ్ ఉన్నప్పటికీ కాస్త విరామం తీసుకొని బాలి ద్వీపానికి వెళ్లినట్లు సమాచారం.

సిద్ధార్థ్ అప్పటికే తన బంధువుల పెళ్లి కోసం బాలిలో ఉన్నాడు. సిద్ధార్థ్ మాల్యా కుటుంబానికి దీపికా చాలా దగ్గర అని, ఈ పెళ్లికి ఆమె వారితో పాటు ఉండటం ఎంతో ముఖ్యమని, లండన్‌లో 'కాక్‌టైల్' సినిమా షూటింగ్‌లో బిజీ బిజీగా ఉన్న ఆమెకు సిద్దుతో కాస్తంతా ఏకాంతంగా సమయం గడిపేందుకు ఈ పెళ్లి ఓ చక్కని అవకాశాన్ని ఇచ్చినట్లయిందని దీపిక సన్నిహిత వర్గాలు తెలిపాయి. మరి వీరి ప్రేమ పెళ్లి దాకా వెళ్తుందో.. లేక మిగతా బాలీవుడ్ స్టోరీల మాదిరిగానే డేటింగ్‌తోనే ఆగిపోతుందో కాలమే నిర్ణయించాలి.

English summary
While there have been speculations about Deepika Padukone- Siddharth Mallya relationship going kaput, news has it that the two are still going strong. The couple was recently spotted in Bali spending quality time.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu