»   » వెంకీ, చైతు సినిమాకి ముందు ప్రయోగం చేయబోతున్న ఎన్టీఆర్ డైరెక్టర్!

వెంకీ, చైతు సినిమాకి ముందు ప్రయోగం చేయబోతున్న ఎన్టీఆర్ డైరెక్టర్!

Subscribe to Filmibeat Telugu

దర్శకుడు బాబీ పవన్ చిత్రంతో దర్శకుడుగా మారి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. బాబీ రవితేజ, పవన్ కళ్యాణ్ మరియు ఎన్టీఆర్ వంటి పెద్ద స్టార్స్ సినిమాలు చేసాడు. పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రం నిరాశపరిచినప్పటికీ ఎన్టీఆర్ జైలవకుశ చిత్రం మంచి విజయం సాధించింది. దీనితో బాబీ డైరెక్టర్ గా మళ్ళీ నిలదొక్కుకున్నాడు. జై లవకుశ చిత్రంలో ఎన్టీఆర్ ని త్రిపాత్రాభినయంలో చూపించి ప్రశంసలు అందుకున్నాడు.

బాబీ తన తదుపరి చిత్రం వెంకటేష్, నాగచైతన్యతో చేయనున్నట్లు తెలుస్తోంది. మామ అల్లుళ్లతో బాబీ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతకంటే ముందు బాబీ ఓ ప్రయోగం చేయబోతున్నాడు. బాబీ ఓ చిత్రానికి నిర్మాతగా మారనునట్లు తెలుస్తోంది.

Director Bobby to turn as Producer

సప్తగిరి ఎక్స్ ప్రెస్ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు అరుణ్ పవర్ తెరకెక్కించే చిత్రానికి బాబీ నిర్మాతగా మారనునట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ప్రాజెక్టుపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అదేవిధంగా బాబీ వెంకీ, చైతు చిత్రం కోసం బాబీ కథ సిద్ధం చేసుకుంటున్నాడని సమాచారం.

English summary
Director Bobby to turn as Producer. Bobby is planning for Venkatesh and Naga chaitanya movie
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X