»   » స్టార్ హీరోయిన్ని మా అమ్మలాగ ఉందంటూ జలక్ ఇచ్చిన గ్రేట్ డైరెక్టర్.!

స్టార్ హీరోయిన్ని మా అమ్మలాగ ఉందంటూ జలక్ ఇచ్చిన గ్రేట్ డైరెక్టర్.!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఆ మధ్యన అనుష్కని పెళ్లెప్పుడు చేసుకుంటావని అడిగితే, ఒక రెండు, మూడేళ్లలో చేసేసుకుంటానని, ఆల్రెడీ ఒక వ్యక్తిని చూసి పెట్టుకున్నానని చెప్పిన అనుష్క అతనెవరనేది మాత్రం చెప్పకుండా దాటేసింది. అయితే అనుష్క వేదం డైరెక్టర్ క్రిష్ మద్య ఏదోనడుస్తోందని వారి గురించి గాసిప్స్ జోరుగా సాగాయి. వీరిద్దరూ పెళ్లిచేసుకోబోతున్నారని చాలా ఫాస్ట్ గా అటు కోలీవుడ్, ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం పాకిపోయింది. అప్పట్టో దీనిని వీరిద్దరిలో ఏ ఒక్కరూ ఖండించడం లేదు.అసలు రెస్పాండ్ కూడా ఇవ్వలేదు.

కాగా తొలిసారి 'వేదం"క్రిష్ ఈ వార్తల గురించి నోరువిప్పాడు. వేదం సినిమా తమిళ రీమేక్ వానమ్ పనిలో ఉన్న క్రిష్, అనుష్కతో తనకి జస్ట్ ఫ్రెండ్షిప్ మాత్రమే ఉందని చెప్పాడు. మరో అడుగు ముందుకేసి, అనుష్క తనకి అమ్మలాగా కనిపిస్తుందని, మన సంస్పృతికి చిహ్నమే మా ఇద్దరి స్నేహం అంటున్నాడు. మా ఇద్దరి గురించి ఇలాంటి రూమర్స్ రావడం దురదృష్టకరమని అంటున్నాడు క్రిష్. పోన్లెండి ఇన్నాళ్లకయినా రెస్పాండ్ అయ్యాడు.

English summary
Director Krish says “I and Anushka share a divine friendship and there is nothing more than that as claimed by the media. Anushka is just like my mother and due to baseless rumors Anushka’s image took a thrashing. I am entering wed-lock soon and looking for all your wishes for my big day”.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu