»   » హీరోయిన్ ఔట్ : పవన్ కళ్యాణ్‌కు నచ్చకనే అలా చేసారా?

హీరోయిన్ ఔట్ : పవన్ కళ్యాణ్‌కు నచ్చకనే అలా చేసారా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న ‘గబ్బర్ సింగ్ -2' చిత్రంలో అనీషా ఆంబ్రోస్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆమె ఈ ప్రాజెక్టు నుండి తప్పుకున్నట్లు సమాచారం. ఆమె స్వయంగా తప్పుకుందా? లేక తప్పించారాను అనే విషయంలో సరైన క్లారిటీ లేదు.

వాస్తవానికి అనీషా ఆంబ్రోస్ మీద ముందు నుండి మంచి ఇంప్రెషన్ లేదు మెగా అభిమానుల్లో.... ఆ మధ్య గోపాల గోపాల చిత్రంలో యాంకర్ గా కనిపించిన ఆమె పెర్ఫార్మెన్స్ పరంగా ఆకట్టుకోలేక పోయింది. తాజాగా ఆమె గబ్బర్ సింగ్-2 చిత్రం కోసం జరిపిన స్క్రీన్ టెస్టులో కూడా పవన్ కళ్యాణ్ తో పాటు, దర్శక నిర్మాతలను సంతృప్తి పరచలేక పోయిందని, అందుకే ఆమె స్థానంలో వేరొకరిని తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అఫీషియల్ గా ప్రకటన వెలువడాల్సి ఉంది.

 Gabbar Singh 2: Anisha Ambrose replaced with a debutant actress?

‘గబ్బర్ సింగ్-2' చిత్రం షూటింగ్ మే 29 మహారాష్ట్రలోని మల్షెజ్ ఘాట్స్ ప్రాంతంలో ప్రారంభించారు. జూన్ 5తో తొలి షెడ్యూల్ పూర్తయింది కూడా. అయితే షూటింగులో ఇంకా పవన్ కళ్యాణ్ జాయిన్ కాలేదు. రెండో షెడ్యూల్ ను జూలై మొదటి వారంలో ఆరంభిస్తారని, ఆ షూటింగులో పవన్ కళ్యాన్ జాయిన్ అవుతారని తెలుస్తోంది.

గబ్బర్ సింగ్ 2 ఫ్లాస్ బ్యాక్ ఎపిసోడ్లో పవన్ గెడ్డం పెంచుకుని కనపడతారని తెలుస్తోంది. ఆర్టిఫిషియల్ గెడ్డాలతో షూటింగ్ ఎందుకని, పవన్ తనే స్వయంగా గెడ్డం పెంచుకున్నారని సమాచారం. ఈ గెడ్డంతో వచ్చే ఎపిసోడ్ సినిమాలో హైలెట్ గా నిలువనుందని చెప్పుకుంటున్నారు. ఈ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తోనే ...సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని అంటున్నారు.

English summary
Film Nagar source said that, Anisha Ambrose out of Gabbar Singh 2. The latest reports say that Anisha Ambrose is likely to be replaced with a debutant actress. An official confirmation is awaited regarding the same.
Please Wait while comments are loading...