»   » పవన్ కళ్యాణ్‌ను కలిసిన గద్దర్, సీన్లోకి దిల్‌రాజు?

పవన్ కళ్యాణ్‌ను కలిసిన గద్దర్, సీన్లోకి దిల్‌రాజు?

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్: ప్రముఖ ప్రజాగాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడు గద్దర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను కలిసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఓ వైపు పవన్ కళ్యాణ్ రాజకీయ తెరంగ్రేటం చేయబోతున్నారని హాట్ హాట్‌గా చర్చసాగుతున్న నేపథ్యంలో గద్దర్-పవన్ కలిసారనే వార్త మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.

అయితే సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం.....పవన్-గద్దర్ కలవడం వెనక ఎలాంటి రాజకీయ కారణం లేదని తెలుస్తోంది. ఓ సినిమా ప్రాజెక్టులో భాగంగానే వీరిద్దరు కలిసారని అంటున్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఓ పోరాట యోధుడిపై దిల్ రాజు సినిమా ప్లాన్ చేస్తున్నారని, ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్టు డెవలప్‌మెంటులో గద్దర్ కీ రోల్ పోషిస్తున్నారని టాక్.

దిల్ రాజు కోరిక మేరకు ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్టును పవన్ కళ్యాణ్‌కు వినిపించేందుకు గద్దర్ వెళ్లి పవన్ కళ్యాణ్ కలిసారని అంటున్నారు. పవన్ కళ్యాణ్ ఒప్పుకుంటే ఈ సినిమా ఆయనతో తీసేందుకు దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారట. 'జన గన మన' అనే టైటిల్‌తో ఈ సినిమా ప్లాన్ చేస్తున్నారట. అయితే ఇదంతా ఫిల్మ్ నగర్ వర్గాల నుండి అందుతున్న అనధికారిక సమాచారం మాత్రమే.

పవన్ కళ్యాన్ గురించి ఇతర విషయాల్లకి వెళితే...ప్రస్తుతం ఆయన సంపత్ నంది దర్శకత్వంలో గబ్బర్ సింగ్-2 చిత్రంతో పాటు, హిందీ సూపర్ హిట్ మూవీ 'ఓ మై గాడ్' చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కుతున్న చిత్రాలు చేయడానికి కమిట్ అయ్యారు. త్వరలో ఈ చిత్రాలకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

English summary
Popular balladeer, singer Gaddar meets Pawan Kalyan. Source said that, Gaddar met Pawan to discuss about ‘Jana Gana Mana’ movie project.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu