అటకెక్కిన ఆ చిత్రానికి ఎట్టకేలకు మోక్షం.. ఈసారైనా గోపిచంద్‌కు కలిసి వచ్చేనా?

ఒక్కోసారి సినిమాలను తెరకెక్కించడమే కాదు.. విడుదల చేయడమూ ఎంతో కష్టతరం అవుతుంది. ఈ ఎన్నో సినిమాలు ఇప్పటికీ ల్యాబ్‌లోనే పడిఉన్నాయి. వాటన్నంటికి మోక్షం ఎప్పుడు కలుగుతుందో ఎవ్వరూ చెప్పలేరు. మధ్యలో ఆగినవి కొన్ని.. ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్నవి కొన్ని.. ఇతర కారణాల వల్ల కొన్ని అటకెక్కుతాయి. ఆ క్రమంలోనే గోపీచంద్ చిత్రమొకటి ఎప్పటి నుంచి వాయిదాలు పడుతూనే వచ్చింది. చివరకు ఆ సినిమా ఊసే మరిచిపోయారు. అయితే ప్రస్తుతం ఆ సినిమా మళ్లీ వార్తల్లోకి ఎక్కింది.

వరుసగా రెండు ప్రాజెక్ట్‌లు..

వరుసగా రెండు ప్రాజెక్ట్‌లు..

గోపీచంద్ ఆ మధ్య వరుసగా రెండు ప్రాజెక్ట్‌లను లైన్‌లో పెట్టాడు. గౌతమ్ నందా, ఆరడుగుల బుల్లెట్ అనే రెండు సినిమాలు రిలీజ్‌కు రెడీ అయ్యాయి. అయితే ఆరడుగుల బుల్లెట్ మాత్రం మధ్యలోనే ఆగిపోయింది. మధ్యలో మళ్లీ ఓ సారి తెరపైకి వచ్చినా మోక్షం కలగలేదు.

 ప్రస్తుతం మరో ప్రయత్నం..

ప్రస్తుతం మరో ప్రయత్నం..

అయితే ప్రస్తుతం ఈ చిత్రాన్ని ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారట. ఇప్పట్లో థియేటర్లు తెరిచే పరిస్థితి ఎక్కడా కనబడటం లేదు. అందుకే కొంతమంది ఓటీటీ దారిని ఎంచుకున్నారు. తమ సినిమాలను నేరుగా ఆన్‌లైన్‌లో వదులుతున్నారు. అయితే గోపీచంద్ ఆరడుగుల బుల్లెట్‌ను కూడా అదే విధంగా రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యారట.

అటకెక్కిన చిత్రం..

అటకెక్కిన చిత్రం..

2017లోనే ఈ చిత్రాన్ని విడుదల చెయ్యాలి అని ప్లాన్ చేసారు. కానీ ఆర్ధిక లావాదేవీల విషయంలో తేడా రావడంతో వెనక్కి వెళ్లిపోయింది. అయితే ఇప్పుడు ఈ చిత్రానికి ప్రముఖ ఓటిటి సంస్థ మంచి రేటు పలికిందట. దీంతో నిర్మాత ఇదే మంచి ఛాన్స్ అని డైరెక్ట్ గా ఆన్లైన్లో విడుదల చెయ్యడానికి అంగీకరించినట్టు తెలుస్తుంది.

కలిసి వచ్చేనా?

కలిసి వచ్చేనా?

మాస్ డైరెక్టర్ బీ గోపాల్ తెరకెక్కించిన ఈ చిత్రంలో నయన తార హీరోయిన్‌గా నటించింది. వరుస ఫ్లాపుల్లో ఉన్న గోపీచంద్‌కు ఈ సినిమా అయినా కలిసి వస్తుందా? అన్నది చూడాలి. గోపీచంద్ ప్రస్తుతం సీటీమార్ సినిమాను చేస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X