twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఏం చేస్తాం...చిరంజీవి పుట్టిన రోజున విడుదల చేద్దాం

    By Srikanya
    |

    హైదరాబాద్ : రామ్‌చరణ్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'గోవిందుడు అందరివాడేలే'. కాజల్‌ హీరోయిన్. కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తున్నారు. బండ్ల గణేష్‌ నిర్మాత. ఈ చిత్రం ఫస్ట్ టీజర్ ని కృష్ణ వంశీ పుట్టిన రోజు సందర్భంగా ఈ రోజు విడుదల చేద్దామనుకున్నారు. అయితే సంగీత దర్శకుడు యవన్ శంకర్ రాజా వేరే పనుల్లో బిజీగా ఉండటం, కృష్ణ వంశీ సైతం రీషూట్ లతో వర్క్ లోడ్ పెరిగిపోవటంతో అనుకున్న సమయానికి పూర్తి చేయలేకపోయారు. దాంతో ఈ టీజర్ ని చిరంజీవి పుట్టిన రోజున(ఆగస్టు 22న) విడుదల చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. శ్రీకాంత్‌, కమలినీ ముఖర్జీ ఇతర ముఖ్య పాత్రధారులు. ఈ సినిమాలో ప్రకాష్‌రాజ్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు.

    కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్నఈ చిత్రంలో చరణ్‌ పల్లెలో అడుగుపెట్టే ఎన్నారై పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. యూనిట్‌ కన్యాకుమారి, పొలాచ్చి షెడ్యూల్స్‌ పూర్తి చేసుకుని హైదరాబాద్‌ చేరింది. చాలా కాలం తర్వాత సొంతగడ్డపై అడుగుపెట్టిన ప్రవాస భారతీయుడిగా పోనీ టెయిల్‌తో కనిపించబోతున్నాడు రామ్‌చరణ్‌. . ఇందులో ప్రధాన పాత్రధారుల ఆహార్యం, ఆభరణాలు అన్నీ కొత్తగా ఉండబోతున్నాయి. ఇందులో రామ్‌చరణ్‌ పంచెకట్టుతో ఎడ్లబండిపై తన తాత పాత్రధారి ప్రకాష్ రాజ్ తో తిరుగుతూ కనిపిస్తాడు.

    'Govindudu' teaser release to Chiranjeevi's birthday

    నిర్మాత మాట్లాడుతూ ''తెలుగుదనం ఉట్టిపడే కథ కథనాలతో తెరకెక్కుతున్న చిత్రమిది. ఇటీవలే కన్యాకుమారి, పొల్లాచ్చి, రామేశ్వరంలో కీలక సన్నివేశాలు తెరకెక్కించాం. రామోజీఫిల్మ్‌సిటీలో కొంతభాగం తెరకెక్కిస్తాం. విదేశాల్లో పాటల్ని చిత్రీకరిస్తాం. రామ్‌చరణ్‌, రాజ్‌కిరణ్‌, శ్రీకాంత్‌ల మధ్య తెరకెక్కించిన సన్నివేశాలు.. ఇంటిల్లిపాదినీ ఆకట్టుకొనేలా ఉన్నాయి'' అన్నారు.

    శ్రీకాంత్, కమిలినీ ముఖర్జీ ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు నటినటులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: సమీర్‌రెడ్డి, నిర్మాత: బండ్ల గణేష్, సమర్పణ: శివబాబు గండ్ల, దర్శకత్వం: కృష్ణవంశీ.

    English summary
    Ram Charan shifted the idea of Govindudu Andarivadele teaser release to Chiranjeevi's birthday on August 22nd.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X