»   » ‘బద్రీనాథ్’ కోసం మాస్టర్ ప్లాన్ వేసి గజినితో చేతులు కలిపిన అరవింద్..!?

‘బద్రీనాథ్’ కోసం మాస్టర్ ప్లాన్ వేసి గజినితో చేతులు కలిపిన అరవింద్..!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

గుణశేఖర్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన చిత్రం 'వరుడు". అల్లు అర్జున్ భారీ అంచనా పెట్టుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ పరాజయాన్ని చవిచూసిన విషయం తెలిసిందే..దీనితో ఎలాగైనా తనకున్న స్టార్ ఇమేజ్ ని మరింత పెంచుకోవాలనే ఉద్దేశ్యంతో అల్లు అర్జున్..'బద్రీనాథ్"వంటి భారీ బడ్జెట్ చిత్రంతో తన స్టామినా ఏంటో నిరూపించుకోబోతున్నాడు.

వివి వినాయక్ దర్శకత్వంలో గీతాఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్ అల్లు అర్జున్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. తన మేనల్లుడిని మగధీరుడ్ని చేసి తెలుగు చలన చిత్ర రికార్డ్స్ ని తిరగరాయించిన అల్లు అరవింద్ 'బద్రీనాథ్" తో మరోసారి టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సందడి చేయడానికి రెడీ అవుతున్నాడు..ఊహకందని ప్రత్యేకలతో, ఊహించని కథాకథనాలతో, విజువల్ ఫీస్ట్ గా రూపొందుతున్న ఈ చిత్రం కోసం అల్లు అరవింద్ ఓ భారీ స్కెచ్ ని రెడీ చేశాడు.

గజిని చిత్రంతో బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ కి దగ్గరైన అల్లు అరవింద్..ఆ పరిచయాన్ని బద్రీనాథ్ కోసం వాడుకోబోతున్నాడు. అదీ అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్ రూపంలో..అదేంటి బద్రీనాథ్ కోసం ఇమ్రాన్ ఖాన్ ని వాడుకోవడం ఏమిటి అనుకుంటున్నారా? తన తనయుడు అల్లు అర్జున్ తో, అల్లు అరవింద్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న బద్రీనాథ్ ని బాలీవుడ్ లో కూడా రిలీజ్ చేసేందుకుగాను..అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ చేత బద్రీనాథ్ లో ఓ స్పెషల్ గెస్ట్ రోల్ కూడా చేయించబోతున్నాడట...

English summary
Allu Arjun is striving hard for ‘Badrinath’ under the direction of VV Vinayak and produced by Allu Aravind on the banner of Geeta Arts. Badrinath is also being made with a heavy budget. Now Allu Aravind is preparing a master plan to market his film not only in Tollywood but also in Bollywood and is planning to release the film in Hindi too.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu