ఇషా రెబ్బాతో టాప్ డైరెక్టర్ డేటింగ్? ఆ హీరో ఇంట్లో సీక్రెట్‌గా..!

టాలీవుడ్ టూ బాలీవుడ్ ఇండస్ట్రీలో నటీనటులు, ఇతర టెక్నీషియన్స్ మధ్య ప్రేమాయణాలు జోరుగుతున్నాయి. చిత్ర పరిశ్రమలో హీరో హీరోయిన్ల మధ్య ప్రేమలు, పెళ్లిళ్లు కామన్‌గానే జరుగుతూ వస్తున్నాయి. అయితే దర్శకుడితో ప్రేమలో పడి వారిని పెళ్లి చేసుకున్న హీరోయిన్లూ తక్కువేం కాదు.. బ్లాక్ అండ్ వైట్ రోజుల నుంచి నేటి వరకు ఎందరో తమ ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్లారు. మణిరత్నం - సుహాసిని, కృష్ణవంశీ- రమ్యకృష్ణతో పాటు ఈ కోవలో ఎందరో ఉన్నారు. తాజాగా తెలుగులో ఓ టాప్ దర్శకుడు, హీరోయిన్‌లు పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ వివరాల్లోకి వెళితే,.

పెళ్లి చూపులతో సంచలనం
2016లో విజయ్ దేవరకొండ - రీతూ వర్మ జంటగా వచ్చిన పెళ్లి చూపులు చిత్రంతో ఒక్కసారిగా ఇండస్ట్రీని షేక్ చేశారు దర్శకుడు తరుణ్ భాస్కర్. ఈ సినిమాతో టాలీవుడ్‌లో ఆయన బిజీ అవుతారని.. వరుస సినిమాలు చేస్తాడని అంతా అనుకున్నారు.. కానీ ఆ సక్సెస్‌ను తరుణ్ కంటిన్యూ చేయలేకపోయారు. పెళ్లి చూపులు చేసిన రెండేళ్ల తర్వాత ఈ నగరానికి ఏమైంది, పిట్ట కథలు, కీడా కోలా సినిమాలకు మాత్రమే దర్శకత్వం వహించారు. అయితే దర్శకుడిగా కంటే నటుడిగా తరుణ్ భాస్కర్ బిజీ అయ్యారు.

Is Eesha Rebba and Tarun Bhascker in a Relationship The duo Attend Vishwak Sen s diwali bash

హీరోయిన్‌గా నత్తనడకన కెరీర్
ఇక అచ్చ తెలుగు అమ్మాయిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు ఈషా రెబ్బా. అందం, అభినయం పరంగా మంచి మార్కులు వేయించుకున్నప్పటికీ ఈ ముద్దుగుమ్మకు అనుకున్న స్థాయిలో సక్సెస్ రాలేదు. అంతకుముందు ఆ తర్వాత, బందిపోటు, ఓయ్, అమీతుమీ, దర్శకుడు, అ, బ్రాండ్ బాబు, అరవింద సమేత, సుబ్రహ్మణ్యపురం, సవ్యసాచీ, రాగల 24 గంటల్లో, మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్, మామ మశ్చీంద్ర వంటి తెలుగు సినిమాలలో నటించింది. కానీ వీటిలో చాలా వరకు సెకండ్ లీడ్‌ పాత్రలే కావడం గమనార్హం. ఇండస్ట్రీకి వచ్చి 13 ఏళ్లు కావొస్తున్నా నేటికీ టాప్ హీరోయిన్‌గా స్టార్ డమ్ మాత్రం అందుకోలేకపోయింది ఈష.

తరుణ్ భాస్కర్ - ఈషా జంటగా సినిమా
కాగా.. ఈషా రెబ్బా - తరుణ్ భాస్కర్‌లు ప్రస్తుతం రిలేషన్‌లో ఉన్నట్లుగా జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనికి కారణాలు కూడా లేకపోలేదు. ప్రస్తుతం వీరిద్దరూ హీరో హీరోయిన్లుగా ఓం శాంతి శాంతి శాంతి అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారిందని గాసిప్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇద్దరూ ఒకరిని విడిచి ఒకరు ఉండలేని స్టేజ్‌కి వచ్చేశారంటూ ఫిలింనగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ రూమర్స్‌ను నిజం చేస్తూ తరుణ్ భాస్కర్ - ఈషా రెబ్బాలు ఒకే చోటు ప్రత్యక్షమయ్యారు.

Take a Poll

జంటగా దీపావళి వేడుకలు
దీపావళి పర్వదినం కావడంతో హీరో విశ్వక్‌సేన్ ఇంట్లో పండుగ సెలబ్రేషన్స్ జరిగాయి. విశ్వక్ ఇంటికి వచ్చిన తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బాలు కలిసి టపాసులు కాల్చారు. దీనికి సంబంధించిన ఫోటోలను విశ్వక్‌సేన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. అలాగే విశ్వక్‌తో దిగిన ఫోటోలో కానీ, మరో ఫోటోలో కానీ ఈషా - తరుణ్‌లు పక్కపక్కనే, బాగా క్లోజ్‌గా ఉన్నారు. దీంతో వీరిద్దరి వ్యవహారం చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. నిజానికి తరుణ్ భాస్కర్‌కు గతంలోనే లతా నాయుడుతో వివాహం జరిగింది. లత కూడా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తే కావడం విశేషం. పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది, యూటర్న్ వంటి సినిమాలకు ప్రొడక్షన్, కాస్ట్యూమ్ డిజైనర్‌గా ఆమె పనిచేశారు. అయితే తరుణ్ - లత కొంతకాలం క్రితం విడాకులు తీసుకుని విడిపోయారు. ఈ క్రమంలో ఈషాతో తరుణ్ క్లోజ్‌గా ఉండటం హాట్ టాపిక్‌గా మారింది. మరి నిజంగానే వీరిద్దరూ రిలేషన్‌లో ఉన్నారా? లేక ఏదైనా సినిమా ప్రమోషన్స్‌ కోసం ఇలా కలిశారా? అన్నది వేచి చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X