twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గ్రీకువీరుడు,సుకుమారుడు స్టోరీ లైన్స్ ఒకటేనా?

    By Srikanya
    |

    హైదరాబాద్ : నాగార్జున తాజా చిత్రం 'గ్రీకు వీరుడు' కి, సాయికుమార్ కుమారుడు ఆది తాజా చిత్రం'సుకుమారుడు' కి స్టోరీ లైన్స్ ఒకటే అనే ప్రచారం ఫిల్మ్ సర్కిల్స్ లో జరుగుతోంది. రెండు చిత్రాల్లో హీరోలు ఎన్నారైలే కావటం..ఇండియాకు వచ్చి ప్రేమలో పడి,తమ వ్యక్తిత్వంలో మార్పు తెచ్చుకోవటం కధాంశం. అయితే రెండు చిత్రాలకు ట్రీట్ మెంట్ వేరుగా ఉంటుందని చెప్తున్నారు.

    'గ్రీకు వీరుడు' గురించి నిర్మాత డి.శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ... ''పరిణతితో కూడిన ప్రేమకథ ఇది. నాగార్జున ఎన్నారైగా నటించారు. అమెరికాలో ఓ ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీకి అధిపతిగా ఆయన కనిపిస్తారు. మాతృదేశంలోకి అడుగుపెట్టాక ఆయనకి ప్రేమ గురించి ఎలాంటి అభిప్రాయాలు కలిగాయో తెర మీదే చూడాలి అన్నారు. అమెరికాలో పెరిగిన అతనికి ప్రేమ, పెళ్లి లాంటి విషయాలపై కచ్చితమైన అభిప్రాయాలున్నాయి. ఓ భామను చూశాక అతను మనసు పల్లవించింది... 'నేవిన్నది నిజమేనా...' అంటూ! అతను ఎవర్ని ఎక్కడ చూశాడు? అతని మనసు ఎలా లయ తప్పింది అన్నదే 'గ్రీకు వీరుడు' చిత్రం.

    ఇక 'సుకుమారుడు' కథ గురించి దర్శకుడు అశోక్ మాట్లాడుతూ..అమెరికా నుంచి పల్లెటూరికొచ్చిన యువకుడు ఇక్కడి వాతావరణానికి తగ్గట్టు మారేందుకు కొంత సమయంపడుతుంది. ఆ క్రమంలో అతనికి ఎదురయ్యే అనుభవాల్ని మా చిత్రంలో చూపిస్తున్నామన్నారు . 'సుకుమారుడు' లో ఆది సరసన నిషా అగర్వాల్‌, నీలమ్‌ ఉపాధ్యాయ హీరోయిన్స్ . వచ్చే నెల 10న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. నిర్మాత కె.వేణుగోపాల్‌ మాట్లాడుతూ ''ఇటు యువతనీ, అటు కుటుంబ ప్రేక్షకుల్నీ సమంగా మెప్పించే చిత్రమిది. సుకుమారుడిగా ఆది నటన అందరికీ నచ్చుతుంది''అన్నారు. కృష్ణ, శారద, గొల్లపూడి మారుతీరావు, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, రావు రమేష్‌, ఎం.ఎస్‌.నారాయణ, శ్రీనివాస్‌ అవసరాల తదితరులు నటించారు.

    'గ్రీకు వీరుడు' చిత్రం లో నాగార్జున, నయనతార జంటగా నటించారు. దశరథ్‌ దర్శకుడు. వచ్చే నెల 3న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. దర్శకుడు మాట్లాడుతూ...గ్రీకువీరుడి ప్రేమాయణం అటు యువతనీ, ఇటు పెద్దవాళ్లనీ సమంగా అలరిస్తుంది. నాగార్జున హెయిర్ స్టైల్, డ్రస్ కొత్త ట్రెండ్‌ని సృష్టిస్తుంది. నయనతార అభినయం ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది. ఇటీవలే సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి. యు/ఎ ధ్రువపత్రం లభించింది. ఈ చిత్రంలో ఏడు పాటలు ఉన్నాయి. దేనికదే ప్రత్యేకం. తమన్‌ అందించిన స్వరాలకు మంచి స్పందన వస్తోంది. త్వరలో సంగీత విజయోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తామి అన్నారు. ఈ చిత్రంలో మీరా చోప్రా, కె.విశ్వనాథ్‌, బ్రహ్మానందం, ఎమ్మెస్‌ నారాయణ, కోట శ్రీనివాసరావు, నాగినీడు, భరత్‌రెడ్డి తదితరులు నటించారు.

    English summary
    As per Film Nagar Sources Nag's Greeku Veerudu, Aaadi's Sukumaarudu films are similar Story lines with different treatments.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X