యువ డైరెక్టర్‌కు చుక్కలు చూపించిన కాజల్.. ఆ హీరోకు నో..

By Rajababu

Recommended Video

Kajal Agarwal Rejected Prashanth Varma's Offer

గత దశాబ్దకాలంగా అందాల తార కాజల్ అగర్వాల్ కెరీర్ స్టడీగా దూసుకుపోతున్నది. పదేళ్లలో అటు గ్లామర్ పాత్రలతోనూ, ఇటు ఫెర్ఫార్మెన్స్ పాత్రలతోనూ ఆకట్టుకొంటున్నది. 2007లో లక్ష్మీ కల్యాణంతో కెరీర్ ఆరంభించిన ఈ ముద్దుగుమ్మ అర్ధ శతకాన్ని అందుకొన్నది. వయసు పెరిగినా ఇంకా గ్లామర్‌తో అగ్రహీరోలతో జతకడుతూ ప్రేక్షకులను మెప్పిస్తున్నది. ఇలాంటి పరిస్థితుల్లో ఓ యువ దర్శకుడు ఇచ్చిన ఆఫర్‌ను కాజల్ తిరస్కరించడం టాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. ఇంతకీ ఆ యువ దర్శకుడు ఎవరు? ఆ కథా కమామీషు ఏంటంటే..

సీనియర్, యువ హీరోలతో

సీనియర్, యువ హీరోలతో

చిరంజీవి, రవితేజ లాంటి సీనియర్ హీరోలతోపాటు.. ఎన్టీఆర్, రానా లాంటి యువ హీరోలతో కూడా నటిస్తూ కాజల్ అలరిస్తున్నది. అందం, అభినయంతో తనదైన శైలిలో విజయాలను అందుకొంటున్నది. అందుకే తమిళ, తెలుగు చిత్రాల నిర్మాతలు ఆమె కోసం క్యూ కడుతున్నారు.

50 చిత్రాలు పూర్తి

50 చిత్రాలు పూర్తి

నేనే రాజు నేనే మంత్రి చిత్రంతో 50 సినిమాలను పూర్తి చేసుకొన్నది. హీరోయిన్లు రెండు మూడు సినిమాలకే కనుమరుగైపోతున్న నేపథ్యంలో కాజల్ 50 సినిమాలు పూర్తి చేసుకోవడమంటే మామూలు విషయం కాదు. అందుకే ఆమె తన స్టార్ హోదాను పెంచుకొంటూ పోతున్నది.

ప్రశాంత్ వర్మ ఆఫర్

ప్రశాంత్ వర్మ ఆఫర్

ఇటీవల కాలంలో ఖైదీ నంబర్ 150, ఆ తర్వాత ఎమ్మెల్యే, అ! లాంటి చిత్రాల్లో నటించి సక్సెస్ పంథాను కొనసాగిస్తున్నారు. ఇలాంటి స్థితిలో అ! చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇచ్చిన ఆఫర్‌ను తిరస్కరించడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.

 రాజశేఖర్‌తో సినిమా

రాజశేఖర్‌తో సినిమా

అ! సక్సెస్ తర్వాత ప్రస్తుతం డాక్టర్ రాజశేఖర్‌తో ప్రశాంత్ వర్మ సినిమా రూపొందించనున్నారు. గరుడవేగతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన రాజశేఖర్ సరసన కాజల్ అగర్వాల్‌ను హీరోయిన్‌గా పెట్టాలని ఆమెను సంప్రదించారట. తన వద్దకు వచ్చిన ఆఫర్‌ను తెలుసుకొని కాజల్ కంగుతిన్నారట. నా కెరీర్‌ ఇంకా కొన్నాళ్లు కొనసాగిస్తే బాగుంటుందని భావిస్తున్నాను. కాబట్టి మీ సినిమా చేయలేను అని చెప్పడం జరిగిందట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X