»   » ‘బాహుబలి’కి రానా రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?.. దర్శక, నిర్మాతలకు దడ..

‘బాహుబలి’కి రానా రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?.. దర్శక, నిర్మాతలకు దడ..

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాహుబలి సినిమాకు ముందు నటుడిగా నిలదొక్కుకునేందుకు రానా దగ్గుబాటి ప్రయత్నించారు. తెలుగులో హీరోగా చేసిన సినిమాలు పేరు తెచ్చినా స్టార్ హీరో అనే ముద్ర వేయించుకోలేకపోయాడు. కానీ హిందీ, తెలుగు భాషల్లో వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటునే వ్యాపారం, తదితర అంశాలపై దృష్టిపెట్టారు. కానీ బాహుబలి సినిమా ఒక్కసారిగా రానాను ఆకాశానికి ఎత్తేసింది. హిందీలో ఇప్పటికే చాలా సినిమాలు చేసిన రానాకు బాహుబలి మరింత క్రేజ్ తెచ్చిపెట్టింది. బాహుబలి సినిమాకు అందుకొన్న రెమ్యునరేషన్ ప్రస్తుతం టాక్ ఆఫ్ ఇండస్ట్రీగా కావడం గమనార్హం.

భారీ రెమ్యునరేషన్..

భారీ రెమ్యునరేషన్..

బాహుబలిలో భళ్లాలదేవ పాత్రతో నెగిటివ్ టచ్ ఇచ్చినా రానా నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. విభిన్న పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా దగ్గుబాటి నట వారసుడు పేరుతెచ్చుకొన్నాడు. తాజాగా బాహుబలి చిత్రంలో నటించినందుకు గానూ కెరీర్‌లోనే అత్యధిక రెమ్యునరేషన్ అందుకొన్నట్టు సమాచారం. బాహుబలి2 సినిమాకు దాదాపు రూ.15 కోట్ల రెమ్యునరేషన్ అందుకొన్నట్టు తెలుస్తున్నది. హీరోగా చేసిన సినిమాలకు కూడా ఈ మొత్తం రాకపోవడం గమనార్హం.

కఠోర పరిశ్రమ..

కఠోర పరిశ్రమ..

బాహుబలిలో నటించినందుకు రానాకు ముట్టిన మొత్తం విషయంలో ఆయనకు న్యాయమే జరిగిందనే మాట వ్యక్తమవుతున్నది. భళ్లాలదేవ పాత్ర కోసం రానా మానసికంగా, శారీరకంగాను చాలా ఒత్తిడికి గురయ్యాడు. శరీర ఆకృతిని భారీ స్థాయిలో మార్చుకొన్నాడు. ఈ పాత్ర కోసం రానా పలు రకాల కసరత్తులు చేశారు. శరీర బరువును 110 కిలోలకు పెంచుకొన్నాడు. భళ్లాలదేవ పాత్రకు మరొకరిని ఊహించుకోవడానికి వీలు లేకుండా ప్రభావాన్ని చూపాడు.

రెమ్యునరేషన్ పెంచిన రానా

రెమ్యునరేషన్ పెంచిన రానా

బాహుబలి తర్వాత రానా తన స్టామినాకు తగినట్టుగా రెమ్యునరేషన్ భారీగా పెంచినట్టు తెలుస్తున్నది. రానాతో విభిన్నమైన పాత్రల చేయించాలనే అభిప్రాయంతో ఉన్న దర్శక, నిర్మాతలు ఆయన రెమ్యునరేషన్ తెలుసుకొని అడుగు వెనక్కి వేస్తున్నారనేది తాజా సమాచారం. నిర్మాతలను పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని రానా తన పారితోషికం విషయంలో కొంత వెసలుబాటు కల్పిస్తే మంచిదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

సంచలన విజయం

సంచలన విజయం

రానా, ప్రభాస్, అనుష్క నటించిన బాహుబలి సినిమా కలెక్షన్లపరంగా 1000 కోట్లను దాటేందుకు దూసుకెళ్తున్నది. విడుదలైన ప్రతీచోట భారీ కలెక్షన్లను రాబడుతున్నది. ఇప్పటికే భారతీయ సినిమా పరిశ్రమలో గతంలో ఉన్న రికార్డులను తిరగరాస్తూ.. కొత్త మైలురాళ్లను నెలకొల్పేందుకు ముందుకెళ్తున్నది.

English summary
Ballala Deva Rana Daggubati has received his career’s highest remuneration with the film Baahubali, and this is one thing that is being discussed a lot in the recent times. The report reveals that Rana Daggubati has got a remuneration close to Rs 15 crores for the project.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu