»   » జూనియర్ టీం నుంచి బయటకు వచ్చి బన్నితో కలిసాడు...... వక్కంతం వంశీ తో బన్నీ సినిమా నిజమేనా??

జూనియర్ టీం నుంచి బయటకు వచ్చి బన్నితో కలిసాడు...... వక్కంతం వంశీ తో బన్నీ సినిమా నిజమేనా??

Posted By:
Subscribe to Filmibeat Telugu

స్టార్ హీరోల కథారచయితగా వక్కంతం వంశీ మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక ఎన్టీఆర్ సినిమాతో దర్శకుడిగా పరిచయమవ్వడానికి రంగాన్ని సిద్ధం చేసుకున్నాడు.తెలుగులో 'కిక్', 'రేసుగుర్రం', 'టెంపర్' లాంటి పలు సూపర్ హిట్ సినిమాలకు కథా రచయితగా పనిచేసి మంచి క్రేజ్ తెచ్చుకున్న

రచయిత వక్కంతం వంశీ దర్శకుడిగా మారి ఓ సినిమాను తెరకెక్కించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు ఓ కథను వినిపించగా, ఆయన ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు పచ్చజెండా కూడా ఊపారంటూ వార్తలు వచ్చాయి. జనతా గ్యారేజ్ తరువాత ఎన్టీఆర్ వక్కంతం వంశీ డైరక్షన్ లోనే సినిమాచేస్తారని నిన్న మొన్నటి వరకు వినిపించింది.

అయితే మధ్యలో ఏం జరిగిందో ఏమో గానీ సడెన్ గా వక్కంతం ఎన్టీఆర్‌ క్యాంప్ నుంచి బయటకు వచ్చేసాడన్న వార్త షాక్ లా మారింది. అంతేకాదు ఇప్పుడు ఇంకో షాకింగ్ న్యూస్ ఏమిటంటే ఎన్టీఆర్‌ కోసమే ఇన్నాళ్ళూ ఆగిన వంశీ ఇప్పుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో కలిసాడట. మరి అసలు ఏది నిజం?? జూనియర్ కాదన్న కథ తోనే బన్నీ సినిమా చేయనున్నాడా అనేది ఆసక్తిగా మారనుంది.

ఎన్టీఆర్ తోనే చెయ్యాలని:

ఎన్టీఆర్ తోనే చెయ్యాలని:

స్టార్ హీరోల కథారచయితగా వక్కంతం వంశీ మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక ఎన్టీఆర్ సినిమాతో దర్శకుడిగా పరిచయమవ్వడానికి రంగాన్ని సిద్ధం చేసుకున్నాడు.

నిన్నా మొన్నటి వరకు కూడా:

నిన్నా మొన్నటి వరకు కూడా:

వారం రోజుల క్రితం కూడా ఈ ఇద్దరి సినిమా పేరు "ధడ్కన్" అని నిర్ణయించారనీ కూడా చెప్పుకున్నారు...

బయటకి వచ్చేసాడు:

బయటకి వచ్చేసాడు:

అంతలో ఏమైందో గానీ ఇప్పుడు వక్కంతం జూనియర్ తో చేసే సినిమా ఆగిపోయిందనీ ఆయన ఎంన్టీఆర్ క్యాంప్ నుంచి బయటకు వచ్చారనీ చెప్పుకుంటున్నారు. అసలు ఈ ఇద్దరి మధ్యా ఏం జరిగిందన్నది మాత్రం తెలియటం లేదు..

ఇప్పట్లో లేదన్నాడు:

ఇప్పట్లో లేదన్నాడు:

ఎన్టీఆర్ కూడా మూడురోజుల కింద ఒక ఇంటర్వ్యూలో మీడియాతో మాట్లాడుతూ తరువాత సినిమా ఇంకా డిసైడ్ చేసుకోలేదని, కాస్త విశ్రాంతి తీసుకుంటానని, అంత త్వరగా సినిమాలు చేసేయాలన్న ఆతృత లేదని చెప్పేసాడు.

మొత్తం రివర్స్ అయ్యింది:

మొత్తం రివర్స్ అయ్యింది:

తారక్ చేసిన చాలా సినిమాలకు కథ అందించిన వక్కంతం వంశీ డైరక్టర్ గా మారేందుకు దాదాపు రెండేళ్ల నుండి వెయిట్ చేస్తున్నాడు. కా ఇప్పుడు తాజా వివాదం తో మొత్తం రివర్స్ అయ్యింది.

ఎందుకూ అన్నదే తెలియదు:

ఎందుకూ అన్నదే తెలియదు:

వక్కంతం వంశీ తనంతట తానే ఎన్టీఆర్ క్యాంప్ వీడి బయటకు వచ్చేసినట్లు తెలుస్తోంది. మరి ఎందుకు అలా వచ్చేసాడు అన్నది తెలియదు కానీ, వచ్చేసిన మాట మాత్రం పక్కా అని తెలిసింది.

ఇంకో షాకింగ్ మ్న్యూస్ :

ఇంకో షాకింగ్ మ్న్యూస్ :

ఈ నేపథ్యంలో ఇంకో షాకింగ్ న్యూస్ వినిపిస్తోంది. బన్నీకి వక్కంతం వంశీ ఒక కథను వినిపించాడట. కథ చాలా ఆసక్తికరంగా ఉండటంతో, వెంటనే బన్నీ ఓకే చెప్పేశాడని అంటున్నారు.

'దువ్వాడ జగన్నాధం' తరువాత :

'దువ్వాడ జగన్నాధం' తరువాత :

అయితే ఇప్పుడు "దువ్వాడ జగన్నాథం" సినిమాతో బన్నీ బిజీ కానున్నాడు. ఈ సినిమా తరువాత వక్కంతం వంశీతో కలిసి బన్నీ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని చెప్పుకుంటున్నారు.

వెయిట్ చేస్తాడా? :

వెయిట్ చేస్తాడా? :

అయితే ఈ సినిమా అయ్యి వీళ్ళ సినిమా పట్టాలెక్కాలంటే ఎంతలేదన్నా కనీసం ఇంకోసం సంవత్సరం ఆగాల్సిందే. మరి అప్పటివరకూ వక్కంతం వంశీ వెయిట్ చేస్తాడా? మరో హీరోతో మరో కథను ప్లాన్ చేస్తాడా? అనేది చూడాలి.

ఇప్పటికే రెండేళ్ళు:

ఇప్పటికే రెండేళ్ళు:

ఎందుకంటే ఇప్పటికే జూనియర్ తోనే అంటూ రెండేళ్ళు వేస్ట్ చేసుకున్నాడు. ఈ సంవత్సరం గడిచే సరికి మళ్ళీ ఏం జరుగుతుందో తెలియదు కదా...

English summary
The star writer Vakkantam Vamshi approached Stylish Star Allu Arjun and narrated a story line. The stylish star has reportedly been impressed with the story of the film..
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu