»   »  షాక్ : ఎన్టీఆర్ ఓకే చేసినవి రెండూ సీక్వెల్సే?

షాక్ : ఎన్టీఆర్ ఓకే చేసినవి రెండూ సీక్వెల్సే?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : సీక్వెల్ అనేది ఎంత సేఫ్ గేమో అంత డేంజరస్ వ్యవహారం. అందుకే స్టార్ హీరోలు సీక్వెల్ వ్యవహారం అనేసరికి కాస్త వెనకా,ముందూ ఆలోచిస్తూంటారు. ఎందుకంటే సీక్వెల్స్ పై ఎక్సపెక్టేషన్స్ పెరిగి, రీచ్ కాలేక అవి భాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన సినిమాలే ఎక్కువ. అయితే ఇప్పుడు కమిటై ఎన్టీఆర్ చేయబోతున్నవి రెండూ సీక్వెల్సే అని ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఆ దర్శకులు పూరి జగన్నాథ్, సురేంద్రరెడ్డి అని తెలుస్తోంది.

పూరీ జగన్నాథ్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో రూపొందే చిత్రానికి వక్కంతం వంశీ కథ ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కథ పోకిరికి సీక్వెల్ గా ఉంటుందని వినపడుతోంది. అందుకే కథ విన్న పూరీ జగన్నాథ్ వెంటనే ఆ కథతో ఎన్టీఆర్ తో చిత్రం చేయటానికి ముందుకు వచ్చాడంటున్నారు. బండ్ల గణేష్ నిర్మించే ఈ చిత్రానికి కుమ్మేస్తా అనే టైటిల్ ప్రచారంలో ఉంది. త్వరలోనే షూటింగ్ మొదలు కానుంది.

Jr NTR to act in Kick,Pokiri sequels

ఇక కళ్యాణ్ రామ్ నిర్మాతగా సురేంద్ర రెడ్డి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో హీరోగా ఎన్టీఆర్ ని ఎంపిక చేసారని సమాచారం. ఆ కథ మరేదో కాదని సమాచారం. అది కిక్ కు సీక్వెల్ అని తెలుస్తోంది. ఈ పాయింట్ ఇప్పటికే ఎన్టీఆర్ కు చెప్పారని అంటున్నారు. వక్కంతం వంశీనే ఈ చిత్రానికి కథ అందించటం విశేషం. ఎన్టీఆర్ కు గతంలో అశోక్, ఊసరవెల్లి చిత్రాలకు వక్కంతం కథలు ఇచ్చారు. ఆ మధ్యన వక్కంతం వంశీకి ఎన్టీఆర్ డేట్స్ ఇచ్చి డైరక్టర్ ని చేస్తానన్నారు.

ఎన్టీఆర్ ఆర్ట్స్ అనగానే నందమూరి కల్యాణ్‌రామ్ సినిమాలు గుర్తుకొస్తాయి. ఆ బ్యానర్‌లో ఆయనే సొంతంగా నటిస్తూ, ఇన్నాళ్లు సినిమాలను నిర్మించుకున్నారు. కానీ తొలిసారి మరో హీరోతో కల్యాణ్‌రామ్ సినిమాను రూపొందించనున్నారు. అది 'కిక్-2'. తమన్ సంగీత దర్శకుడిగా తెరంగేట్రం చేసింది ఈ సినిమాతోనే. సురేందర్‌రెడ్డి దర్శకత్వం చేసిన ఈ సినిమాలో
రవితేజ, ఇలియానా నటించారు.

'కిక్' కోసం హీరో చేసే పనులు ఇందులో అందర్నీ మెప్పించాయి. పోలీసాఫీసర్‌గా నటించిన శ్యామ్‌కు 'కిక్' ఏకంగా ఇంటిపేరుగా మారిపోయింది. ఈ సినిమాకు తాజాగా సీక్వెల్ సిద్ధమవుతోంది. దీని గురించి సురేందర్‌రెడ్డి మాట్లాడుతూ "కిక్-2కు సంబంధించిన స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. ఈ స్క్రిప్ట్‌కి 'కిక్' సినిమాకు పోలిక లేదు. హీరో పాత్ర మాత్రం కాస్త 'కిక్'ను పోలి ఉంటుంది. మిగిలిందంతా ఫ్రెష్‌గా ఉంటుంది'' అని చెప్పారు.

English summary
For now, Jr NTR is quite busy wrapping the final shoots of Rabhasa and soon he will be working with Puri Jagan for his next flick. In the mean time Sukumar's love story with young tiger is kept on hold, it appears.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu