»   » ముఖ్యమంత్రి కలల్లో తేలిఆడుతున్న జూ.ఎన్టీఆర్..

ముఖ్యమంత్రి కలల్లో తేలిఆడుతున్న జూ.ఎన్టీఆర్..

Subscribe to Filmibeat Telugu

యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ ఇప్పుడు వరుస సినిమాలతో ఊపిరిసల్పడానికి కూడా వీలులేనంత బిజీగా వున్నాడు. ఓ పక్క శక్తి సినిమా, మరో వైపు బృందావనం సినిమాలతో జైపూర్, హైదరాబాదుల మధ్య చక్కర్లు కొడుతున్న ఎన్టీఆర్ ఏది మరచిపోయినా ప్రస్తుత రాజకీయాల మీద ఆరాలు తీయండం, వాటి గురించి చర్చించడం మాత్రం మరవడం లేదట. ఎన్టీఆర్ నటించిన అదుర్స్ సూపర్ హిట్ అవడంతో మంచి ఊపు మీద వున్న యంగ్ టైగర్ తను ముఖ్యమంత్రి కావాలని బహిరంగంగా ప్రకటించకపోయినా తన తాత గారి లాగే తను కూడా ముఖ్యమంత్రి అవ్వాలనే ఆశతో వున్నాడట.

రాబోయే మే నాటికి ఓ ఇంటివాడు కాబోతున్న ఎన్టీఆర్ సుమారు 500 కోట్ల రూపాయలతో పాటు ఓ టివి ఛానెల్ ను కట్నంగా పొందుతున్నాడని సమాచారం. వీటికి తోడు తన నటిస్తున్న సినిమాలకు జూనియర్ సుమారు 10 కోట్ల రూపాయలు పారితోషికంగా పొందుతున్నాడు. వీటన్నింటికీ మించి తన తండ్రి సంపాదించిన ఆస్తిని కలిపితే ఎన్టీఆర్ ఆస్తికి కొదవ లేదు. దీంతో తనకున్న పలుకుబడి, ఆస్తి అన్నిటికన్నా ముఖ్యమయిన తన తాతగారి పేరును ఉపయోగించుకుని తను కూడా ఏదో ఓ రోజు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్న ఎన్టీఆర్ తన సన్నిహితులతో రాజకీయాల గురించే ఎక్కువగా చర్చిస్తున్నాడట. ఈ విషయాన్ని ఎన్టీఆర్ సన్నిహిత స్నేహితుడు ఒకరు ఇటీవలే ఓ పార్టీలో తాగినమైకంలో బయటపెట్టేసాడట. మరి ఎన్టీఆర్ ఇప్పటి మెగాస్టార్ లాగా రాజకీయాల్లో అట్టర్ ఫ్లాప్ కాకుండా తన తాతయ్య గారి లాగా సూపర్ హిట్ అవ్వడమే కాకుండా రాష్ట్ర ప్రజలకు ఓ మంచి పాలకుడిలాగా మిగిలిపోవాలని ఆశిద్ధాం.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu