»   » ఎన్టీఆర్ , బాబి కాంబోచిత్రం టైటిల్ ఇదా.. ? బడ్జెట్ ఎంతంటే

ఎన్టీఆర్ , బాబి కాంబోచిత్రం టైటిల్ ఇదా.. ? బడ్జెట్ ఎంతంటే

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : జనతా గ్యారేజ్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన ఎన్టీఆర్.. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా కోసం రెడీ అవుతున్నారు. తన అన్న నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మాతగా ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై తెరకెక్కనున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఎన్టీఆర్ సరసన ముగ్గురు హీరోయిన్స్ నటిస్తున్న ఈ సినిమాకు ఓ టైటిల్ ను ఫిక్స్ చేశారన్న టాక్ ఫిల్మ్ సర్కిల్స్ లో బయిలుదేరింది.

ఆ టైటిల్ ఏమిటంటే...నట విశ్వరూపం . నాలుగైదు టైటిల్స్ అనుకుని ఈ టైటిల్ ను ఫైనల్ చేసే ఆలోచనలో దర్శకుడు, హీరో ఉన్నారట చెప్పుకుంటున్నారు. అయితే ఈ టైటిల్ ఏమి గొప్పగా లేదని సోషల్ మీడియాలో విమర్శలు వినపడుతున్నాయి. అయితే ఇది యూనిట్ అనుకున్న టైటిల్ కాదని, ఎవరో అభిమానులు ఊహగా అనుకుని ప్రచారంలోకి తెచ్చినదే అని ఓ వాదన వినపడుతోంది.

మరో ప్రక్క నందమూరి కళ్యాణ్ రాం నిర్మిస్తున్న ఈ సినిమా బడ్జెట్ పై ముందే ఆంక్షలు విధించారని చెప్పుకుంటున్నారు. ఈమధ్య కళ్యాణ్ రామ్ నిర్మించిన సినిమాలన్ని ఫ్లాపులు అవుతుండటంతో ఈసారి బడ్జెట్ మితిమీరకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలనే నిర్ణయం తీసుకున్నట్లు చెప్తున్నారు.

Jr NTR’s next is ‘Nata Viswaroopam’?

ముఖ్యంగా కిక్ 2, ఇజం ఫ్లాఫ్ దెబ్బ నుంచి కోలుకునేందుకు ఎన్టీఆర్ ఈ సినిమా తో సాయిం చేస్తున్నాడంటున్నారు. బాబికి ముందే 45 కోట్ల బడ్జెట్ అని చెప్పేశాడట కళ్యాణ్ రామ్. అంతకుమించి బడ్జెట్ పోకుండా చూడాలని గట్టిగా చెప్పారట.

రవితేజ తో చేసిన పవర్ తర్వాత పవన్ తో సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా తీసిన బాబి ఆ సినిమా ఫ్లాప్ అవడంతో కాస్త గ్యాప్ తీసుకున్నాడు. ఇక నిన్న మొన్నటిదాకా రవితేజతో సినిమా అని అనుకున్నా అది కుదరకపోవడంతో తారక్ తో సినిమాకు ఫిక్స్ అయ్యాడు. మరి ఫ్లాప్ వచ్చినా లక్కీ ఆఫర్ కొట్టేసిన బాబి సినిమాను ఏ రేంజ్లో తీస్తాడో చూడాలంటున్నారు సినిమా జనం.

English summary
jr NTR will now be seen in the direction of K S Ravindra aka Bobby. ‘Nata Viswaroopam’ title doing rounds from the past few days and it is said to be confirmed by the makers.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu