»   » ఆశ్చర్యం.. చెల్లెలు పాత్ర ఒప్పుకుందా?

ఆశ్చర్యం.. చెల్లెలు పాత్ర ఒప్పుకుందా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : నాగ చైతన్య తో జోష్, ఎన్టీఆర్ తో దమ్ము చిత్రాలు చేసిన కార్తీక తాజాగా చెల్లిలి పాత్ర కమిటై అందరినీ షాక్ కు గురి చేసింది. అదీ అల్లరి నరేష్ నటించే కామెడీ సినిమాలో అనే సరికి అందరూ ఆశ్చర్యపోతున్నారు. వీడు తేడా దర్శకుడు చిన్ని కృష్ణ దర్శకత్వంలో అమ్మిరాజు నిర్మిస్తున్న ఎంటర్టైనర్ లో ఆమె కీలక మైన పాత్రకు ఎంపికైంది. విలన్ ని ప్రేమించే పాత్రలో ఆమె కనిపించనుంది. ఈ పాత్ర కోసం ఎడ్వెంచర్స్ చేస్తుందని తెలుస్తోంది. అలాగే నరేష్ సరసన మోనాల్ గజ్జల్ కనిపించనుంది.

కామెడీ చిత్రాలు అంటే భాక్సీఫీస్ వద్ద మినిమం గ్యారెంటీ చిత్రాలు అనే ముద్ర ఉంది. అందులోనూ ఈ మధ్య కాలంలో కామెడీ చిత్రాలకు మరింత ఆదరణ పెరిగింది. ముఖ్యంగా అల్లరి నరేష్ చిత్రాలకు అంటే బయ్యర్లు కళ్ళు మూసుకుని కొనేసారు. అయితే ఇప్పుడు ఇదే హీరో చిత్రాలు అంటే భయపడి పరారవుతున్నారని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. నరేష్ సినిమాలు వరసగా భాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ కావటం కారణంగా చెప్తున్నారు. జంప్ జిలాని సైతం నిరాశపరచటంతో పూర్తిగా నరేష్ పై హోప్స్ పోయాయని అంటున్నారు.

Nara Lokesh to play key role in TDP

అయితే ఇందులో అల్లరి నరేష్ స్వయం కృతాపరాధమే ఎక్కువ అంటున్నారు. నరేష్ సినిమాలు ఈ మధ్యకాలంలో బడ్జెట్ బాగా పెరిగిపోయాయి. సుడిగాడు వచ్చిన తర్వాత 12 కోట్లు దాకా నరేష్ సినిమాలను బిజినెస్ చేసేస్తున్నారు. దాంతో రికవరీ కష్టమైపోతోంది. దానికి కారణం నరేష్ తనకు ఇంత బడ్జెట్ పెట్టాలి అని పట్టుపట్టడమే అంటున్నారు. సేఫ్ జోన్ లో తక్కువ బడ్జెట్ లో సినిమా చేస్తే దానికి తగినట్లు బిజినెస్ జరిగి... ఫ్లాఫ్ అనిపించుకున్నా...పెద్దగా ఎవరూ లాస్ అయ్యే వాతావరణం కనపడేది కాదు.. మినిమం గ్యారెంటీతో బయిటపడేది. అమాంతంగా పెంచిన బడ్జెట్ తో ఎక్కువ రేట్లు పెట్టి కొనడం, తర్వాత తీరిగ్గా బాధపడటం జరుగుతోంది.

దీనికితోడు నరేష్ ఈ మధ్యన చేసేవన్నీ రొటీన్ కామెడీతో ఒకే తరహా జోకులతో, ప్యారెడీలతో వస్తున్నాయి. ప్యారెడీలు ఇప్పుడు టీవీలో జబర్దస్త్ వంటి పోగ్రాంకి షిప్ట్ అయిపోయాయి. జబర్దస్ నటులతో కలిసి నరేష్ తెరపై ఇదే ప్యారెడీ కామెడీ చేస్తే ఎవరు చూస్తారంటున్నారు. అంతేగాక ఇంతకు ముందు కామెడీ సినిమా అంటే నరేష్ ఒక్కడిదే ఉండేది. మహేష్ నుంచి సుధీర్ బాబు దాకా, పవన్ నుంచి అల్లు శిరీష్ దాకా తమ చిత్రాల్లో కామెడీ చేసేస్తున్నారు. ఈ నేపధ్యంలో నరేష్ కామెడీ వీరికన్నా భిన్నంగా తను మాత్రమే చేయగలిగేది ఉంటేనే చూస్తారంటున్నారు.

English summary
Karthika Nair will be seen acting as Allari Naresh’s sister in his new movie directed by Chinni krishna.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X