»   » త్వరలోనే కరుణాకరన్‌తో సినిమా ఉంటుందన్న యంగ్ హీరో

త్వరలోనే కరుణాకరన్‌తో సినిమా ఉంటుందన్న యంగ్ హీరో

Posted By:
Subscribe to Filmibeat Telugu

'దేవదాస్, మస్కా" చిత్రాల ద్వారా తనకంటూ ఓ సొంత బాణీని ఏర్పరచుకున్నారు హీరో రామ్. ప్రస్తుతం రామ్ 'కందిరీగ"లో నటిస్తున్న విషయం తెలిసిందే. వాసు దర్శకత్వంలో బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో హన్సిక కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రం కోసం ప్రస్తుతం ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ తీస్తున్నారు. ఈ క్లిష్టమైన ఫైట్లో రామ్ డూప్ లేకుండా విజృంభిస్తున్నారు. ఈసినిమాకు సంబంధించి రామ్ తన ట్విట్టర్‌లో ఈక్రింది విధంగా పోస్ట చేశారు. ''ఒళ్లంతా గీరుకుపోయింది.. అది చాలదన్నట్లు మెడ నొప్పి ఒకటి. అయినా ఏం ఫర్వాలేదు. యాక్షన్ సీక్వెన్స్ ఓ రేంజ్‌లో వస్తోంది. అందుకు ఆనందంగా ఉంది"" అని తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు రామ్.

ఈ సందర్భంగా రామ్ మాట్లాడుతూ ''ఫలానా ఫైట్ కోసం రక్తం, చెమట ధారపోశాం అని కొంతమంది నటులు అంటుంటారు. ఇప్పుడు నా పరిస్థితి కూడా అదే. మాట వరసకు అనడం కాదు కానీ నిజంగానే ఒక ఫైట్ చిత్రీకరణ సమయంలో మా కష్టం ఆ రేంజ్‌లోనే ఉంటుంది. 'కందిరీగ" మంచి కథతో రూపొందుతున్న చిత్రం. ఈ చిత్రం నాకు చాలా ఎగ్జయిట్‌మెంట్‌నిస్తోంది. ఈ చిత్రానికి చక్రి సంగీతం అందిస్తున్నారు. ఆయనతో నాకిది మూడో సినిమా. ఇప్పుడీ సి నిమా పాటల చిత్రీకరణ ఎప్పుడు మొదలవుతుందా అని ఎదురు చూస్తున్నాను. ఇదిలా ఉంటే 'కందిరీగ" సెట్స్‌కి దర్శకుడు కరుణాకరన్ వచ్చారు. ఇద్దరం కలిసి సినిమా చేయడానికి అత్యంత ఉత్సాహంతో ఉన్నాం"" అన్నారు. ఇప్పటివరకు ఆంధ్ర రాష్ట్రంలో రామ్‌కు 15 అభిమాన సంఘాలు ఏర్పడ్డాయన అన్నారు.

Please Wait while comments are loading...