»   » మహేష్ ఖలేజా..ఓల్డ్ దేవానంద్ చిత్రం కాపీనా?

మహేష్ ఖలేజా..ఓల్డ్ దేవానంద్ చిత్రం కాపీనా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో రెడీ అవుతున్న చిత్రం ఓ బాలీవుడ్ చిత్రంకి ప్రీమేక్ అంటూ మీడియోలో వినపడుతోంది. దేవానంద్ హీరోగా నటించిన ఆ చిత్రం అప్పట్లో మంచి విజయం సాధించిందని అదే సినిమాని కొద్దిగా ఇప్పుడు కాలానికి మార్చి,యాక్షన్ ఎపిసోడ్స్ కలిపారని చెప్పుకుంటున్నారు. ఇక ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతున్న కథ ప్రకారం మహేష్ బాబు..ఓ టాక్సీ డ్రైవర్ గా పనిచేస్తూంటాడు. అతనితో కలిసి పనిచేసే ఓ వ్యక్తి యాక్సిడెంట్ లో మరణిస్తే ఆ ఇన్సూరెన్స్ డబ్బు పట్టుకుని ఆ ఫ్యామిలికీ ఇవ్వటానికి ఆ వ్యక్తి సొంత వూరైన రాజస్ధాన్ లోని ఓ గ్రామం బయిలుదేరతాడు. అక్కడ పరిస్ధితి చాలా ఘోరంగా అరాచకంగా ఉంటుంది. అక్కడకి చేరిన మహేష్ ని అక్కడ వారు దేముడిలా భావించి ట్రీట్ చేస్తారు. అక్కడ పరిస్ధితులపై పోరాడి మహేష్ వారి సమస్యలు ఎలా తీరుస్తాడనేది మిగతా కథ అంటున్నారు. అలాగే ఇంతకు ముందు ఈ చిత్రంకి ట్యాగ్ లైన్ గా దైవం మానుష్య రూపేణ అని పెట్టే ఆలోచన చేసారు. అయితే ఇప్పడది లేదు. ఇక ఈ కథ నిజమవటానకి ఎంత అవకాసముందో...అంత రూమర్ కూడా కావచ్చు. ఇక సినిమా రిలీజ్ అయ్యేవరకూ నమ్మదగినవి, నమ్మలేనివి ఇలాంటి క్రేజ్ సినినిమాకి వస్తూనే ఉంటాయి. అదీ మ్యాటర్.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu