»   » త్రివిక్రమ్, మహేష్ బాబు సినిమాలో భారీ మార్పులు...

త్రివిక్రమ్, మహేష్ బాబు సినిమాలో భారీ మార్పులు...

Posted By:
Subscribe to Filmibeat Telugu

దాదాపు సంవత్సరం క్రితం మొదలైన త్రివిక్రమ్, మహేష్ బాబు సినిమా కలేజా(వర్కింగ్ టైటిల్) ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుపుకుంటోంది. అలాగే ఈ చిత్రానికి సంబంధించిన పలు విషయాల్లో మార్పులు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా నిర్మాత సి.కళ్యాణ్ ఈ చిత్రం పూర్తి భాధ్యతను తీసుకుని దగ్గరుండి చూస్తున్నట్లు తెలుస్తోంది. నిర్మాత శింగనమల రమేష్ బడ్జెట్ అనుకున్న పరిధి దాటిపోవటం, సినిమా రీ షూటింగ్ జరగటం వంటివి గమనించి ఈ నిర్ణయానికి వచ్చి కళ్యాణ్ కి అప్పచెప్పినట్లు చెప్తున్నారు. కళ్యాణ్ అయితే డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఆచి తూచి ఖర్చు పెడతారని ఆయన్ని ఎంటర్ చేసారంటున్నారు. ఇక ఇప్పటివరకూ పనిచేసిన కెమెరా మెన్ సునీల్ పటేల్ ని మార్చి యాష్ భట్ ని తీసుకున్నట్లు తెలుస్తోంది. యాష్ భట్ ఇంతకు ముందు రామ్ చరణ్ తేజ, ధోణిలతో కూల్ డ్రింక్ యాడ్ చేసారు. ఇక అనుష్క హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం పై ప్రేక్షకులతో మంచి అంచనాలే ఉన్నాయి. అతిధి తర్వాత చాలా గ్యాప్ తో మహేష్ బాబు ఈ చిత్రాన్ని చేస్తున్నారు. అలాగే ఈ చిత్రం అనంతరం శ్రీను వైట్ల దర్శకత్వంలో మహేష్ బాబు చిత్రం ఉంటుంది. సమంతా ఈ చిత్రంలో హీరోయిన్ గా ఉంటోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu