»   » పవన్ ‘కాటమరాయుడు’ మరో షాక్, సినిమాటోగ్రాఫర్ ని మార్చేసారు

పవన్ ‘కాటమరాయుడు’ మరో షాక్, సినిమాటోగ్రాఫర్ ని మార్చేసారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' తర్వాత పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ హీరోగా నటిస్తున్న చిత్రం 'కాటమరాయుడు'. ఈ చిత్రం షూటింగ్‌ బుధవారం సికింద్రాబాద్‌లో ప్రారంభమైంది. ఈ నెల 24 నుంచి పవన్‌ ఈ చిత్రం షూటింగ్‌లో పాల్గొననున్నారు. ఈ చిత్రంలో తాజాగా ఓ మేజర్ మార్పు చోటు చేసుకుందని సమాచారం.

ఈ సినిమాకి మొదట సినిమాటోగ్రాఫర్ గా సౌందర్ రాజన్ ను అనుకున్నారు. గతంలో ఈ సినిమాటోగ్రాఫర్... రవితేజ చిత్రం 'బెంగాల్ టైగర్' కు పనిచేసి మంచి అవుట్ పుట్ ఇవ్వటంతో అతన్ని ప్రాజెక్టులోకి తీసుకున్నారు. కానీ చిత్రం అనుకున్న టైమ్ కి మొదలుకాకపోవడంతో ఆయన ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారని సమాచారం.

దాంతో ఈయన స్థానంలో పవన్ కెరీర్ లో పెద్ద హిట్ గా నిలిచిన 'అత్తారింటికి దారేది' చిత్రానికి సినిమాటోగ్రఫీ భాద్యతలు నిర్వహించిన ప్రసాద్ మురెళ్ళ ను తీసుకున్నారని తెలుస్తోంది. గతంలోనూ సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా విషయంలోనూ పలు మార్పులు సినిమా ప్రారంభంలో చోటు చేసుకున్న సంగతి గుర్తుండే ఉండి ఉంటుంది. ఇక ఈచిత్రానికి మొదట దర్శకుడు ఎస్ జె సూర్య ని అనుకుని డాలీ ని సీన్ లోకి తెచ్చారు.

Major replacement in Pawan's Katamarayudu

ఈ సినిమాకు అత్తారింటికి దారేదితో మరో లింక్ ఉంది. కాటమరాయుడా కదిరి నరసింహుడా... అంటూ అత్తారింటికి దారేది కోపం పవన్ కల్యాణ్ గొంతెత్తి పాడాడు. ఇప్పుడు ఆ పాటని మరోసారి గుర్తు చేయబోతున్నాడుపవన్‌. ఎందుకంటే ఈ పాటలోని పదమే పవన్ కొత్త సినిమాకి టైటిల్ గా మారింది.

ఫ్యాక్షన్ నేపథ్యంలో సాగే ప్రేమ కథ ఇది. రాయలసీమ ప్రాంతం చుట్టూ తిరిగే కథ. రాయలసీమలో కాటమరాయుడు భలే ఫ్యామస్‌. అందుకే ఈ టైటిల్ ఫిక్స్ చేశార్ట. ఈ సినిమా కోసం కడప కింగ్ అనే పేరూ అనుకొన్నారు. కానీ కడప కింగ్ అంటే ఓ ప్రాంతానికి సంబంధించిన టైటిల్‌గా మిగిలిపోతుందని, కాటమరాయుడు అంటే రాయలసీమ మొత్తానికీ రిప్రజెంట్ చేయొచ్చని చిత్ర యూనిట్ భావిస్తోంది.


నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై శరత్‌ మరార్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో పవన్‌కల్యాణ్‌ సరికొత్త ప్రేమికుడిగా కనిపించనున్నారు. పవన్‌ సరసన శృతిహాసన్‌ నటిస్తున్నారు. అనూప్‌ రూబెన్స్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. కథ: ఆకుల శివ, ఎడిటర్‌: గౌతమ్‌రాజు, ఆర్ట్‌ డైరెక్టర్‌: బ్రహ్మ కడలి.

English summary
Initially, noted Tamil cinematographer Soundarrajan, was roped in to crank the camera for Katamarayudu. The makers now replaced him with Prasad Murella, who had earlier shot Pawan’s Atharintiki Dharedi.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu