»   » మళ్ళీ లారెన్స్ డైరక్షన్ లో నాగార్జున

మళ్ళీ లారెన్స్ డైరక్షన్ లో నాగార్జున

Posted By:
Subscribe to Filmibeat Telugu

నాగార్జునతో మాస్, డాన్ చిత్రాలు రూపొందించిన రాఘవ లారెన్స్ తో మూడోసారి నాగార్జున ని డైరక్ట్ చేయనున్నాడని సమాచారం.రవితేజ తో కిక్ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని రూపొందించిన ఆర్ ఆర్ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ మేరకు నాగార్జునకు ఆ సంస్ధ అధినేత వెంకట్ అడ్వాన్స్ ఇచ్చారని తెలుస్తోంది. ఇక ఈ చిత్రానికి దర్శకుడుగా లారెన్స్ తీసుకుంటున్నాడని,ఇప్పటికే అతను స్క్రిప్టు సబ్మిట్ చేసాడని అంటున్నారు. ప్రస్తుతం నాగార్జున..రాధామోహన్ దర్శకత్వంలో గగనం అనే చిత్రం చేస్తున్నారు. అనంతరం తన సోదరి నాగసుశీల నిర్మాతగా ప్రారంభమయ్యే చిత్రం ఉంటుంది. ఆ తర్వాత ఈ లారెన్స్ చిత్రం ఉంటుంది. ప్రస్తుతం లారెన్స్‌ 'సూపర్‌ కౌబాయ్‌" అనే భారీ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. అలాగే అనుష్క తో లారెన్స్‌ దర్శత్వంలో 'కాంచన" అనే లేడీ ఓరియంటెడ్‌ చిత్రం రూపుదిద్దుకోబోతోందన్న సంగతి తెలిసిందే. ఇక ఇంతకుముందే లారన్స్, నాగార్జున కలయికలో పవర్ అనే టైటిల్ తో ఓ చిత్రం వస్తుందనే వార్తలు వచ్చాయి...కానీ అవి కార్య రూపం దాల్చలేదు.

Please Wait while comments are loading...