»   » కొడుక్కి ఇచ్చినట్లుగానే తనకీ హిట్టిస్తాడని నాగార్జున...

కొడుక్కి ఇచ్చినట్లుగానే తనకీ హిట్టిస్తాడని నాగార్జున...

Posted By:
Subscribe to Filmibeat Telugu

'ఏ మాయ చేసావె' తన తనయుడు నాగచైతన్యకి హిట్టిచ్చినట్లుగానే తనకూ విజయం ఇమ్మన్నట్లుగా గౌతం మీనన్ ని నాగార్జున ఓకే చేసారు. గౌతం మీనన్ దర్శకత్వంలో నాగార్జున కొత్త చిత్రం కమిటయ్యారు. నాగార్జున సోదరి నాగసుసీల నిర్మించే ఈ చిత్రం త్వరలో ప్రారంభం కానుంది. ఇక ఈ చిత్రానికి సంభందించి గౌతం మీనన్ చెప్పిన లైన్ నాగార్జున ఇప్పటికే ఓకే చేసి ఉన్నారు. దానికి సంభందించిన పూర్తి స్క్రిప్టుని త్వరలోనే అందచేస్తానని గౌతం మీనన్ హామీ ఇచ్చారు. ఇక చింతలపూడి శ్రీనివాసరావుతో కలిసి నాగసుశీల గతంలో తన కుమారుడు సుశాంత్ ని హీరోగా పెట్టి కాళిదాసు, కరెంట్ చిత్రాలు రూపొందించింది. అవి రెండూ భాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ టాక్ తెచ్చుకున్నాయి. ఇక తమిళంలో ప్రస్తుతం గౌతం మీనన్ చేస్తున్న చిత్రం తర్వాత ఈ కొత్త ప్రాజెక్టు ముందుకెళ్థుంది. అలాగే ఈ లోగా నాగార్జున..వీరూపోట్ల దర్శకత్వంలో చిత్రం పూర్తి చేస్తారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu