»   » నారా రోహిత్ నెక్ట్స్ ఆ డైరక్టర్ తో కన్ఫర్మ్!

నారా రోహిత్ నెక్ట్స్ ఆ డైరక్టర్ తో కన్ఫర్మ్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

'బాణం"తో హీరోగా పరిచయమైన నారా రోహిత్ తన రెండో చిత్రానికి దర్శకుడుని కన్ఫర్మ్ చేసారని సమాచారం. ఈ చిత్రానికి సుకుమార్ వద్ద అసోసియేట్ డైరక్టర్‌గా పనిచేసిన ప్రకాష్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ మేరకు కొన్ని సిట్టింగ్స్ జరిగాయని ఓ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం చేస్తున్నారని తెలుస్తోంది. యునైటెడ్ మూవీస్ పతాకంపై పరుచూరి శివరామకృష్ణ రూపొందిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 15న ప్రారంభం కానుంది. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కనుందని తెలుస్తోంది. అలాగే ప్రకాష్ ఆ మధ్య..సురేష్ ప్రొడక్షన్ లో రానా కోసం కథను చెప్పి కొంతకాలం గెస్ట్ హౌస్ లో సిట్టింగ్ లు జరిపి బయిటకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక అప్పట్లో...నారా రోహిత్ తన తదుపరి చిత్రాన్ని స్టార్ డైరక్టర్ గౌతం మీనన్ దర్శకత్వంలో, బెల్లంకొండ సురేష్ నిర్మిస్తారని వార్తలు వచ్చాయి కానీ ఆ ప్రాజెక్టు మెటీరియలైజ్ కాలేదు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu