»   » నారా రోహిత్ చిత్రం కాన్సిల్ అయినట్లేనా?

నారా రోహిత్ చిత్రం కాన్సిల్ అయినట్లేనా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

సింహా నిర్మాతలు పరుచూరి శివరామ ప్రసాద్ నిర్మించనున్న నారా రోహిత్ చిత్రం కాన్సిల్ అయినట్లే అంతటా వినపడుతోంది. సుకుమార్ దగ్గర అశోసియోట్ గా పనిచేసిన ప్రకాష్ దర్శకత్వంలో ప్లాన్ చేసిన ఈ చిత్రానికి రోహిత్ డేట్స్ ఇబ్బందికావటంతో కాన్సిల్ చేస్తున్నారని తెలుస్తోంది. దానికి కారణం రోహిత్ అనుకోని విధంగా యువత దర్శకుడు పరుశరామ్ తో సినిమా ప్రకటించటమేనని చెప్తున్నారు. ఇక ఈ చిత్రం కోసం హన్సిక కు కూడా అడ్వాన్స్ ఇవ్వటం జరిగింది. గత కొద్ది నెలలుగా ఈ చిత్రం స్టోరీ సిట్టింగ్స్ జరుగుతున్నాయి. త్వరలో షూటింగ్ కు వెళ్ళనున్న సమయంలో ఈ ట్విస్ట్ పడింది. ఇక నిర్మాతలు నారా రోహిత్ ని మార్చి వేరే హీరోతో ముందుకెళ్థారా , లేక పర్మెనెంట్ గా ఈ ప్రాజెక్టు కాన్సిల్ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu