»   » డిప్రెషన్ లోకి కుర్రహీరో

డిప్రెషన్ లోకి కుర్రహీరో

Posted By:
Subscribe to Filmibeat Telugu

సురేష్ ప్రొడక్షన్స్ వంటి పెద్ద బ్యానర్ లో సినిమా అని ఎన్నో ఆశలు పెట్టుకుని చేసిన ముగ్గురు చిత్రం ప్లాప్ అవటంతో నవదీప్ డిప్రషన్ లోకి వెళ్ళిపోయాడు. అందులోను మనసంతా నువ్వే వంటి చిత్రం తీసిన దర్శకుడు వియన్ ఆదిత్య చిత్రం అనగానే తన కెరీర్ తిరిగి కుదుటన పడుతుందని భావించాడు. కానీ ఊహించని దానకి బిన్నంగా జరిగింది. ముగ్గురు చిత్రం డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. పాత కాలం కథతో కామిడీ పండించాలని చూసిన ఆదిత్య ప్రయత్నం విఫలమైంది. అయితే సినిమాలో పేరు వచ్చింది మాత్రం నవదీప్ నటనకే అని చెప్పాలి. సినిమాలో ఉన్న ఆర్టిస్టులో కాస్త ఉషారుగా ముందుండి సినిమాని ముందుకు లాగించాడు. ఇక చాలా కాలం నుండి నవదీప్ వరస ఫెయిల్యూర్స్ ని ఎదుర్కొంటున్నాడు. వచ్చిన ప్రతీ సినిమా మార్నింగ్ షో డబ్బాలు సర్దుకుని వెళ్లిపోయింది. మినిమం హీరో అనే ముద్ర నుంచి ముంచే హీరో అనే స్ధాయికి వచ్చేసాడు. ఇప్పుడు ఈ ముగ్గురు కూడా పోవటంతో తనమీద ఎవరు పెట్టుబడి కట్టి మళ్లీ బెట్ కాయటానకి రెడీ అవుతారని నవదీప్ ఎదురుచూస్తున్నాడు.

English summary
Navdeep has gone into depression. The reason for that happens to be Navdeep's latest offering ‘Mugguru’. The film has turned out to be an utter flop.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu