»   » వచ్చే ఏడాది... బాయ్ ఫ్రెండుతో నయనతార వివాహం!?

వచ్చే ఏడాది... బాయ్ ఫ్రెండుతో నయనతార వివాహం!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన వార్తలతో ఎప్పుడూ మీడియాలో హైలెట్ అవుతూ ఉంటుంది. ప్రభుదేవాతో నయనతార ప్రేమాయణం గురించి తెలిసిందే. దాదాపు పెళ్లి వరకు వచ్చిన వీరు చివరి నిమిషయంలో విడిపోయారు. ప్రభుదేవాతో విడిపోయిన తర్వాత సినిమాల్లో బిజీ అయిపోయింది నయనతార.

'నానుం రౌడీ దాన్‌' చిత్రంలో నటించిన నయనతార ఈ చిత్ర దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో ప్రేమలో పడిందని, ఆ మధ్య వీరికి రహస్యంగా వివాహం జరిగినట్లు కూడా వార్తలు వెలువడ్డాయి. అయితే ఇద్దరూ ఈ వార్తలను ఖండించారు. పెళ్లి విషయం ఖండించినా ఇద్దరి మధ్య లవ్ ఎఫైర్ ఉందని అంటున్నారు.

గతంలో శింబు, ప్రభుదేవాలతో ప్రేమ వ్యవహారంలో నయనతారకు కొన్ని షాకింగ్ అనుభవాలు ఎదురయ్యాయి. అందుకే విఘ్నేష్ శివన్ ప్రేమ వ్యవహారం విషయంలో ఆమె గోప్యత పాటిస్తోందని ఆమె సన్నిహితులు అంటున్నారు. వచ్చే ఏడాది ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని అంటున్నాు. అయితే చివరి నిమిషం వరకు ఇద్దరూ తమ బంధాన్ని రహస్యంగానే కొనసాగించాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది.

ప్రస్తుతం నయనతార నాలుగు చిత్రాల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాలు పూర్తయ్యే వరకు ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా తమ పెళ్లి విషయాన్ని వాయిదా వేసుకున్నారని, 2016లో ఈ ఇద్దరూ ఒక్కటయ్యే అవకాశం ఉందని అంటున్నారు.

నయన-విఘ్నేష్

నయన-విఘ్నేష్


నయనతార, విఘ్నేష్ శివన్ మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందని గత కొంతకాలంగా వార్తలు విపిస్తున్నాయి.

బయట పడటం లేదు

బయట పడటం లేదు


అయితే ఈ విషయాన్ని బయట పెట్టడానికి ఇద్దరూ ఇష్ట పడటం లేదు.

అలా..

అలా..


'నానుం రౌడీ దాన్‌' చిత్రంలో నటించిన నయనతార ఈ క్రమంలో దర్శకుడికి క్లోజ్ అయిందట.

పెళ్లి జరిగినట్లు

పెళ్లి జరిగినట్లు


ఆ మధ్య వీరికి రహస్యంగా వివాహం జరిగినట్లు కూడా వార్తలు వెలువడ్డాయి. అయితే ఇద్దరూ ఈ వార్తలను ఖండించారు.

వచ్చే ఏడాది వివాహం

వచ్చే ఏడాది వివాహం


2016లో ఈ ఇద్దరూ వివాహం ద్వారా ఒక్కటయ్యే అవకాశం ఉందని అంటున్నారు.

English summary
Tamil film source said that, Nayanatara To Marry Her Boyfriend Vignesh Sivan Next Year. She is extremely careful about announcing her wedding plans, though her friends say that it would be simple affair and maintain that it will take place next year.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu