»   » మాజీ ప్రియుడితో నయన్ మళ్లీ 'సై' అంటుందా?: కోలీవుడ్‌లో ఇప్పుడిదే హాట్ టాపిక్

మాజీ ప్రియుడితో నయన్ మళ్లీ 'సై' అంటుందా?: కోలీవుడ్‌లో ఇప్పుడిదే హాట్ టాపిక్

Subscribe to Filmibeat Telugu

సినిమాల్లో ప్రేమలు రెండున్నర గంటల వ్యవధిలో ఓ కొలిక్కి వచ్చేయడం.. ఆపై శుభం కార్డు పడిపోవడం చూస్తుంటాం కానీ సినీ జీవుల నిజ జీవిత ప్రేమలు మాత్రం అంతులేని ట్విస్టులతో సాగిపోతూనే ఉంటాయి.

షార్ట్ ఫిల్మ్ అంత షార్ట్ టైమ్ లోనే ప్రేమ.. బ్రేకప్ రెండూ ముగిసిపోయినా!.. ఆ తర్వాతే అసలు కథ మొదలవుతుంది. తిరిగి మళ్లీ వాళ్లు కలుస్తారా? అన్న ఆసక్తి జనంలో.. ఆ ఆసక్తిని క్యాష్ చేసుకునేలా కాంబినేషన్స్ ప్లాన్ చేసుకోవాలన్న తహతహ ప్రొడ్యూసర్స్‌లో!

Nayan

ఇప్పుడు నయనతార విషయంలోను ఇదే జరుగుతోంది. కోలీవుడ్ లో ఇప్పటికే శింబు, ప్రభుదేవాలతో ప్రేమాయణం నడిపిన ఈ బ్యూటీ.. ఇప్పుడు విఘ్నేశ్ శివతో సహజీవనం చేస్తున్నట్లు కోలీవుడ్ వర్గాలు కోడై కూస్తున్నాయి. సరే ఈ విషయం పక్కనపెడితే.. తన మాజీ ప్రియుడు శింబుతో ఇదునమ్మ ఆళు చిత్రంలో నటించిన నయతారను ఇప్పుడు మరో మాజీ ప్రియుడు ప్రభుదేవాతోను నటింపజేయాలన్న ప్రయత్నాలు కోలీవుడ్‌లో చాలానే జరుగుతున్నాయట.

ప్రస్తుతం కోలీవుడ్‌లో మళ్లీ బిజీ అయిన ప్రభుదేవా.. కార్తీక్ సుబ్బరాజ్ తో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. తొలుత ఈ సినిమాలో కన్నడ నటి సంయుక్తను హీరోయిన్ గా ఎంచుకున్నారని వార్తలు వచ్చినప్పటికీ.. ఆమె స్థానంలో నయనతారను తీసుకోవాలని చిత్ర యూనిట్ భావిస్తోందట. దీంతో నయనతార కాల్ షీట్స్ కోసం ఇప్పుడా ప్రొడ్యూసర్స్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

కాగా, నయనతార ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రాల్లో ఒకటైన కోలైయుధీర్ కాలంలో విలన్ గా ప్రభుదేవాను తీసుకోవడానికి ఆమె ససేమిరా అన్నట్లు ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడదే సినిమాను హిందీలో రీమేక్ చేస్తుండగా అందులో విలన్ గా ప్రభుదేవా, హీరోయిన్ గా తమన్నా నటిస్తున్నారు.

ప్రతినాయకుడి పాత్రకే ప్రభుదేవాను వద్దన్న నయనతార.. ఇప్పుడదే ప్రభుదేవా పక్కన హీరోయిన్ గా నటించడానికి ఒప్పుకుంటుందా? అన్నది కోలీవుడ్ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోన్న అంశం. చూడాలి మరి దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ ఈ మాజీ ప్రేమ జంటను మళ్లీ కలపడంలో ఎంత మేర సఫలం అవుతారో!..

English summary
Its an interesting gossip circulating in Kollywood that Nayanatara may pair up with her ex boyfriend prabhudeva in Karthik Subbaraj direction
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu