»   » నిజమా? అది ‘ఎవడు’ని దెబ్బ కొట్టే సినిమానా!?

నిజమా? అది ‘ఎవడు’ని దెబ్బ కొట్టే సినిమానా!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో ఓ చిన్న సినిమా హాట్ టాపిక్ గా మారింది. అది మరేదో కాదు.. 'బన్ని అండ్ చెర్రి'. దర్శకుడు మారుతి శిష్యుడు రాజేష్ పులి తొలిసారిగా రూపొందిస్తున్న ఈ చిత్రం కథ, 'ఎవడు'కథ ఒక్కటేనని పరిశ్రమ వర్గాల్లో సర్వత్రా చర్చకు తావిచ్చింది. రామ్‌చరణ్, అల్లు అర్జున్ చేసిన పాత్రలే ఇందులో 'బన్ని అండ్ చెర్రి' పోషించిన పాత్రలు కావడం విశేషమని చెప్పుకుంటున్నారు. చిన్న సినిమాగా వస్తున్న ఈ చిత్రం 'ఎవడు'కంటే ముందే విడుదలవుతుండడంతో దెబ్బ పడినట్లేనంటున్నారంతా.

వివరాల్లోకి వెళితే....రామ్‌చరణ్, శృతిహాసన్, అమీజాక్సన్ హీరో హీరోయిన్లుగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'ఎవడు' చిత్రాన్ని 'దిల్'రాజు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అయితే దాదాపుగా ఇదే కథతో మరో చిత్రం థియేటర్లోకి దూసుకురావడానికి రెడీగా వుంది. అది 'బన్ని అండ్ చెర్రి'. ఈ చిత్రం కథ కూడా దాదాపు ఎవడు లాగానే ఉంటుందని ఫిల్మ్ నగర్ టాక్. దానికి తోడు ఎవడు లో ఉన్న రామ్ చరణ్,బన్ని లను గుర్తు చేసేటట్లుగా..బన్ని అండ్ చెర్రీ అని పేరు పెట్టి మరీ వదులుతున్నారు. ఒకరు బదులు మరొకరు పగతీర్చుకోవడమే ఈ రెండు చిత్రాల కథ.


'ఎవడు'ను డిసెంబర్ 19న విడుదల చేస్తున్నట్లు నిర్మాత రాజు ప్రకటించాడు. అయితే ఈ చిత్రం కంటే ఇరవై రోజుల ముందే అంటే ఈనెల 29న 'బన్ని అండ్ చెర్రి'ని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇలా కథ ప్రేక్షకులకు ముందే తెలిసిపోతే 'ఎవడు'ను ఎవడు ఆదరిస్తాడని సినీ జనాలు వాపోతున్నారు. రామ్‌చరణ్ హీరోగా, శ్రుతిహాసన్, ఆమి జాక్సన్ హీరోయిన్లుగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బేనరుపై తను నిర్మించిన 'ఎవడు' చిత్రం డిసెంబర్ 19న విడుదలవుతుందని నిర్మాత దిల్‌రాజు స్పష్టం చేశారు.

'మా బేనరులో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకున్న చిత్రమిది. అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. డిసెంబర్ 19న విడుదల చేస్తాం. రామ్‌చరణ్ నటన, శ్రుతిహాసన్, ఆమి జాక్సన్ అందాలు, దేవిశ్రీప్రసాద్ సంగీతం, వంశీ టేకింగ్ ప్రేక్షుల్ని అలరిస్తాయి. అలాగే కీలకపాత్రల్లో నటించిన అల్లు అర్జున్, కాజల్ అగర్వాల్ పాత్రలు హైలైట్‌గా నిలుస్తాయి' అని తెలిపారాయన. జయసుధ, సాయికుమార్, కోట శ్రీనివాసరావు, రాహుల్‌దేవ్, అజయ్, ఎల్.బి.శ్రీరామ్, సుప్రీత్, 'వెన్నెల'కిశోర్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సహనిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్.

English summary

 Yevadu is getting ready for release a new headache aroused because of a low budget movie. This film is titled Bunny n Cherry starring Prince and Mahat as heroes. The concept of this film is pretty identical to that of Yevadu in which Cherry and Bunny are playing the leads. Yevadu storyline has been making rounds in film nagar for quite some time now and Bunny n Cherry team has made a film using that. If Yevadu story is similar to this one Bunny and Cherry might cause slight problems for the biggie. Although a small budget film's reach may not be as big as Yevadu, it may work as curiosity killer and spoiler to Ram Charan's movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu