For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  భీమ్లా నాయక్ vs ఆచార్య.. కొనసాగుతున్న సస్పెన్స్.. త్వరలోనే మరో మెగా సర్‌ప్రైజ్‌!

  |

  టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మరోసారి సినిమాల రిలీజ్ డేట్స్ విషయంలో నెవర్ బిఫోర్ అనేలా సస్పెన్స్ కొనసాగుతోంది. ఇప్పటికే రెండు పర్యాయాలుగా కరోనా దెబ్బకు విడుదల కావాల్సిన సినిమాలు ఎన్నో పెద్ద సినిమాలు వాయిదా పడ్డాయి. అందులో కొన్ని వచ్చే ఏడాది మొదట్లో కనిపించకపోవచ్చని తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే ఆల్ మోస్ట్ పెద్ద సినిమాల హీరోలు సంక్రాంతితో పాటు సమ్మర్ హాలిడేస్ ను బుక్ చేసుకున్నారు. రోజులు గడుస్తున్నా కూడా ఈ కన్ఫ్యూజన్ పై క్లారిటీ రావడం లేదు. నెవర్ బిఫోర్ అనేలా బాక్స్ ఆఫీసు వద్ద బిగ్గెస్ట్ ఫైట్స్ అయితే కొనసాగుతాయని ఒక టాక్ అయితే గట్టిగానే వినిపిస్తోంది.

  ఇప్పటికే స్టార్ హీరోలు ఎలాంటి పోటీ ఉండకూడదు అని ముందుగానే కొన్ని ఫెస్టివల్స్ ని టార్గెట్ చేశారు. అయినప్పటికీ మిగతా స్టార్ హీరోలు ఏ మాత్రం కంగారు లేకుండా ముఖ్యమైన ఫెస్టివల్స్ ను టార్గెట్ చేస్తూ ఉండడం మరింత హాట్ టాపిక్ గా మారింది. ఇక చూస్తుంటే మెగా బ్రదర్స్ సినిమాల మధ్య కూడా భారీ స్థాయిలో పోటీ నెలకొనే అవకాశం ఉన్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. అది కూడా మెగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగాస్టార్ చిరంజీవి సినిమాలు ఒకేసారి వచ్చే అవకాశం లేకపోలేదని ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతున్నాయి.

  మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ కాంబో..

  మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ కాంబో..

  మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ కలిసి నటించిన మొదటి చిత్రం ఆచార్యపై జనాల్లో అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కొరటాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ మల్టీ స్టారర్ మూవీలో ఒక మంచి సందేశం తో పాటు మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా హైలెట్ కానున్నాయి. తప్పకుండా సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందని ఇప్పటికే ఈ చిత్రం ద్వారా ఒక క్లారిటీ వచ్చేసింది. మెగాస్టార్ చిరంజీవి కూడా సరికొత్తగా కనిపిస్తుండడంతో ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

  ఆచార్య మదిలో రెండు తేదీలు

  ఆచార్య మదిలో రెండు తేదీలు

  అసలైతే ఆచార్య సినిమాను ఈ ఏడాది సమ్మర్ లో విడుదల చేయాలని అనుకున్నారు. కానీ కరోనా వైరస్ వలన షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఫైనల్ గా మూవీని వినాయక చవితి లేదా దసరా సమయంలో తప్పకుండా విడుదల చేయాలని అనుకున్నారు. కానీ కరోనా వైరస్ తో పాటు ఆంధ్రప్రదేశ్ లో టికెట్ల రేట్ల వివాదంపై ఎటూ తేలని పరిస్థితులు నెలకొనడంతో ఎటు తేల్చుకోలేకపోయారు. ఇక ఈ సినిమాను కుదిరితే అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకు తీసుకురావచ్చని సమాచారం. లేదంటే సంక్రాంతి బరిలో జనవరి 12న వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

  పవర్ స్టార్ vs మెగా స్టార్

  పవర్ స్టార్ vs మెగా స్టార్

  అంతా బాగానే ఉంది కానీ ఈ సంక్రాంతికి విడుదల అంటే మెగా అభిమానుల్లో కాస్త టెన్షన్స్ ఉండడం కామన్. ఎందుకంటే ఆ సమయానికి మహేష్ బాబు సర్కారు వారి పాట, ప్రభాస్ రాధే శ్యామ్ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఆ విషయాలను పక్కన పెడితే మెగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా సంక్రాంతి తేదీనే ఫిక్స్ చేసుకున్నాడు. రాణా తో కలిసి నటిస్తున్న భీమ్లా నాయక్ జనవరి 12 విడుదల అవుతున్న విషయం తెలిసిందే.

  భీమ్లా నాయక్ కోసం మరొక డేట్

  భీమ్లా నాయక్ కోసం మరొక డేట్

  ఇక ఈ తేదీలను పక్కనపెడితే మరొక టాక్ ప్రకారం మెగాస్టార్ చిరంజీవి కోసం తమ్ముడు పవన్ కళ్యాణ్ తన విడుదల తేదీని త్యాగం చేసే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తోంది. కుదిరితే భీమ్లా నాయక్ జనవరి 26వ తేదీ కి కూడా రావచ్చు అని కొన్ని రూమర్స్ అయితే వెలువడుతున్నాయి.ఎలాగైనా వీలైనంత త్వరగా విడుదల తేదీ లపై ఓ క్లారిటీ రావాలని మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికే దర్శక నిర్మాతలతో చర్చలు జరిపాడు. ఆంధ్రప్రదేశ్ లో టికెట్స్ రేట్ల విషయంపై త్వరలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో చర్చలు జరపనున్నారు. ఆ విషయంలో ఏదో క్లారిటీ వచ్చిన అనంతరం మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా పై కూడా క్లారిటీకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

  Brandy Diaries ఇండియా లోనే ఫస్ట్ | 100% Alcohol Centric - Director Sivudu
  మెగా బిగ్ ఫైట్..?

  మెగా బిగ్ ఫైట్..?

  కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఆచార్య సినిమా విడుదల తేదీపై ఆగస్టు 22న తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా సంక్రాంతికి విడుదల చేస్తే కనుక ఆ పోటీలో పవన్ కళ్యాణ్ సినిమా ఉండదని చెప్పవచ్చు. ఇక మహేష్ ప్రభాస్ సినిమాలతోపాటు మరో మెగా హీరో వరుణ్ తేజ్ వెంకటేష్ తో కలిసి నటించిన F 3 సినిమాతో సంక్రాంతికి రావాలని ఎప్పుడో ఫిక్స్ అయ్యాడు.

  కామెడీ సినిమాలు నిర్మిస్తున్న దిల్ రాజు ఎలాగైనా సరే సంక్రాంతి సమయంలోనే F3ని విడుదల చేయాలని ఫిక్స్ అయ్యాడు ఆ సమయంలో పోటీ తీవ్రత ఎంత పెరిగినా కూడా ఎక్కువగా ఫ్యామిలీ ఆడియెన్స్ F3 సినిమా వైపు తిరిగే అవకాశం ఉందని అందులోనూ అనిల్ రావిపూడి తెరకెక్కించిన సినిమా కాబట్టి తప్పకుండా మంచి లాభాలను అందిస్తుందని ధైర్యం చేసి రిలీజ్ చేయనున్నారట. మరియు సంక్రాంతి బిగ్గెస్ట్ ఫైట్ లో ఎవరు ఏ స్థాయిలో అత్యధిక వసూళ్లను ఉంటారో చూడాలి

  English summary
  New release dates for pawan kalyan megastar chiranjeevi upcoming movies..
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X