»   » 'సంబరం' నిఖిత ఆల్రెడీ పెళ్ళయిన హీరోతో కాపురం

'సంబరం' నిఖిత ఆల్రెడీ పెళ్ళయిన హీరోతో కాపురం

Posted By:
Subscribe to Filmibeat Telugu

సంబరం, కళ్యాణరాముడు, మహారాజశ్రీ, సరోజ, భద్రాధ్రి, నీ నవ్వే చాలు వంటి చిత్రాలతో తెలుగువారికి పరిచయమైన నిఖిత సీక్రెట్ గా వివాహం చేసుకుందని వినడుతోంది. కన్నడ హీరో దర్శన్ తో ఆమె అనీఫియల్ గా కాపురం చేస్తోందని అక్కడ పత్రికలు రాస్తున్నాయి. అలాగే ఈమె కోసం దర్శన్..ముంబైలో ఓ ప్లాట్ కొనిపెట్టి అక్కడకి రెగ్యులర్ గా వెళ్ళివస్తున్నాడని చెప్తున్నారు. ఇక దర్శన్ కి పదేళ్ళక్రితమే విజయ లక్ష్మి అనే ఆమెతో వివాహం జరిగింది. వారికి రెండు సంవత్సరాల బాబు కూడా ఉన్నాడు.ఇక ఈ విషయమై దర్శన్ కామెంట్ చేయటానికి గానీ, కొట్టిపారేయటానికి ఇష్టపడలేదు. అయితే నిఖిత మాత్ర ఇవన్నీ అర్దం పర్ధం లేని కామెంట్సే అని తేల్చేసింది. అంతేగాక తమ వివాహం సీన్ ప్రిన్స్ అనే సినిమాలో ఉండటంతో ఈ రూమర్ పుట్టి ఉండే అవకాశం ఉందని లాజిక్ చెప్తోంది. ఇక నిఖిత కోసం ఇక్కడ తెలుగులో ఓ దర్శకుడు దేవదాసులా మారి చాలా కాలం ఆ ప్రేమ కోమాలోనే ఉండి కెరీర్ నాశనం చేసుకుని ఇప్పుడు కోలుకుని మళ్ళీ ట్రాక్ ఎక్కి సినిమాలు చేసుకుంటున్నాడు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu