»   » ‘యమలీల’ సీక్వెల్ లో హీరోయిన్స్ వీరే

‘యమలీల’ సీక్వెల్ లో హీరోయిన్స్ వీరే

Posted By:
Subscribe to Filmibeat Telugu
Nisha Kothari, Sada
హైదరాబాద్: 1994లో మదర్ సెంటిమెంట్ నేపథ్యంలో వచ్చిన సోషియో ఫాంటసీ చిత్రం 'యమలీల'. ఎస్వీకృష్టాడ్డి దర్శకత్వంలో అలీ హీరోగా నటించిన ఈ సినిమా అప్పట్లో ఏ స్థాయిలో సంచలనం సృష్టించిందో అందిరికి తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రం సీక్వెల్ రూపొందుతోంది. ఈ చిత్రంలో హీరోయిన్స్ గా సదా,నిషా కొఠారి ఎంపిక అయినట్లు సమాచారం. వీరిద్దరిపై ఓ పాటను ఈ వారంలో చిత్రీకరించటానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఆయన యమధర్మరాజు గా కనిపించనున్నారు. జనవరిలో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. హీరోగా కొత్త కుర్రాడిని ఎంపిక చేసారని వినికిడి.

అలీ కెరీర్‌లోనే భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమాకు త్వరలో సీక్వెల్‌ను రూపొందిస్తున్నారు దర్శకుడు ఎస్వీకృష్టాడ్డి. 'యమలీల 2' పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమాలో యమధర్మరాజు పాత్రలో ప్రముఖ నటుడు మోహన్‌బాబు నటించనున్నారని, ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాల్ని దర్శకుడు ఎస్వీకృష్టాడ్డి త్వరలో ప్రకటించనున్నారని చిత్ర వర్గాల సమాచారం.

ఇక చిత్ర గుప్తుడుగా బ్రహ్మానందమే చేస్తున్నారు. పూర్తి స్ధాయి కామెడీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారని తెలుస్తోంది. గత కొంత కాలంగా ఈ స్క్రిప్టు వర్క్ లోనే ఎస్వీ బిజీగా ఉన్నారు. సీక్వెల్ గా ఈ చిత్రం బిజినెస్ పరంగానూ వండర్స్ క్రియేట్ చేస్తుందని ట్రేడ్ వర్గాల్లో విశ్లేషిస్తున్నారు. అయితే ఎస్వీ కృష్ణారెడ్డి ఈ తరం యువత పల్స్ ని ఎంత మేరకు పట్టుకోగలుగుతాడనే విషయంపై ఈ చిత్రం విజయం ఆధారపడి ఉంటుందనేది మాత్రం.

English summary
Buzz is that SV Krishna Reddy has roped in Nisha Kothari and Sada to play the lead roles in sequel to Yamaleela. A song is going to be filmed on the lead cast from this week.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu