twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎన్టీఆర్ కి ఆగ్రహం... నచ్చచెప్తున్నారు

    By Srikanya
    |

    హైదరాబాద్: ఫలానా తేది విడుదల చేస్తామని అథికారికంగా ప్రకటించాక ఆ తేది కోసం అభిమానులు ఎదురుచూస్తూంటారు. అందుకే పెద్ద హీరోలు ఎవరూ తన సినిమాలను అర్దాంతరంగా వాయిదాలు వేస్తే ఊరుకోరు. మొదట ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకునే విడుదల తేదీని బయిటకు ఇస్తారు. ఇప్పుడు అలాంటి పరిస్ధితే ఎన్టీఆర్ తాజా చిత్రం రభస ఎదుర్కొంటోంది. ఈ చిత్రం ఆగస్టు 15 న విడుదల చేద్దామని మొదట నుంచీ చెప్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు అర్దాంతరంగా రిలీజ్ తేది మారింది. ఆగస్టు 28న రభస ని విడుదల చేయాలని నిర్ణయించారు.

    బెల్లంకొండ సురేష్ తన కుమారుడు బెల్లంకొండ శ్రీనివాస్ లాంచింగ్ చిత్రం అల్లుడు శీను..ని అర్దాంతరంగా థియోటర్స్ నుంచి లేపేయటానికి మనసొప్పక..బెల్లంకొండ వాయిదా అడిగాడని సమాచారం. అయితే ఎన్టీఆర్...తన అభిమానులను దృష్టిలో పెట్టుకుని ఈ వాయిదాని వ్యతిరేకించినట్లు చెప్పుకుంటున్నారు.

     NTR angry with Rabhasa postponement

    అయితే దిల్ రాజు వంటి నిర్మాతలు సైతం...నైజాం లో ...ఓ ప్రక్క అల్లుడు శీను,మరొక ప్రక్కన రన్ రాజా రన్ ఆడుతున్నాయని, వాటి కలెక్షన్స్ బాగున్నప్పుడు తీసేయకుండా కాస్త గ్యాప్ తీసుకుందామని చెప్పి ఒప్పించినట్లు చెప్పుకుంటున్నారు. అప్పటికీ ఎన్టీఆర్ చాలా అసంతృప్తిగా ఉన్నాడని అంటున్నారు. మరొక ప్రక్క రభస పోస్ట్ ప్రొడక్షన్ కూడా ఇంకా పూర్తి కాలేదని అదొక కారణంగా చూపిస్తున్నారు.

    ఇవన్నీ ఇలా ఉంటే అదే రోజు సికిందర్ చిత్రం కూడా రిలీజ్ అవుతోంది. సికిందర్ చిత్రం పై కూడా మంచి అంచనాలే ఉన్నాయి. సూర్య హీరోగా ఉండటం, దర్శకుడు లింగుస్వామి చిత్రం కావటం, సమంత హీరోయిన్ కావటం, లగడపాటి శ్రీధర్ నిర్మాత కావటం వంటి అంశాలు ఈ చిత్రం ఓపినింగ్స్ కి బాగా ఉంటాయని, థియోటర్స్ సమస్య ఖచ్చితంగా ఉంటుందని అంటున్నారు.

    English summary
    NTR is reportedly angry with the filmmakers’ decision to postpone the release date of his upcoming entertainer Rabhasa. Filmmakers postponed the release from Aug 15th to Aug 28th.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X