»   » అన్న కోసం అమెరికా నుంచి వచ్చేయనున్న ఎన్టీఆర్..చూపంతా అతడివైపే..!

అన్న కోసం అమెరికా నుంచి వచ్చేయనున్న ఎన్టీఆర్..చూపంతా అతడివైపే..!

Subscribe to Filmibeat Telugu
అన్న కోసం అమెరికా నుంచి వచ్చేయనున్న ఎన్టీఆర్!

ఎన్టీఆర్ ప్రస్తుతం కెరీర్ పరంగా మహర్దశలో కొనసాగుతున్నాడు. ఎన్టీఆర్ చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఘనవిజయం సాధిస్తున్నాయి. త్రివిక్రమ్, రాజమౌళి చిత్రాలలో నటించేందుకు ఎన్టీఆర్ సిద్ధం అవుతున్నాడు. రాంచరణ్, ఎన్టీఆర్ తో కలసి రాజమౌళి భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని తెరకెక్కించబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబందించిన వర్క్ షాప్ లో పాల్గొనేందుకు ఎన్టీఆర్, చరణ్ అమెరికాకు వెళ్లిన సంగతి తెలిసిందే. సినిమా విషయంలో ఎన్టీఆర్ ఎంత డెడికేషన్ చూపిస్తాడో కుటుంబ బంధాలకు కూడా అంతే విలువ ఇస్తాడు. అమెరికాలో ఉన్న ఎన్టీఆర్ అన్న కోసం ఇండియా రాబోతున్నట్లు తెలుస్తోంది. నందమూరి అభిమానులు పండగ చేసుకునే వార్తే ఇది.

 రెండూ భారీ చిత్రాలే

రెండూ భారీ చిత్రాలే

ఎన్టీఆర్ ప్రస్తుతం నటించబోతున్న రెండు చిత్రాలు భారీ స్థాయిలో రూపొందబోతున్నవే. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తన చిత్రంలో ఎన్టీఆర్ ని సరికొత్తగా ఆవిష్కరించడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇక రాజమౌళి చిత్రం ఏస్థాయిలో ఉండబోతోందో మన ఊహకి కూడా అందదు.

 దుమ్ము దులిపేస్తున్నాడు

దుమ్ము దులిపేస్తున్నాడు

ఎన్టీఆర్ ఇటీవల చిత్రాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము రేపుతున్నాయి. ఎన్టీఆర్ నటించిన చిత్రాలు అలవోకగా భారీ వసూళ్లు సాధిస్తూ నిర్మాతలకు లాభాల పంట పాడిస్తున్నాయి. జై లవకుశ చిత్రంలో అయితే ఎన్టీఆర్ తన నటనతో సినిమాకు ప్రాణం పోసాడు.

 అన్న నిర్మాణంలోనే

అన్న నిర్మాణంలోనే

జై లవకుశ చిత్రం ఎన్టీఆర్ సోదరుడు కళ్యాణ్ రామ్ స్వయంగా నిర్మించడం విశేషం. ఇటీవల ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ మధ్య బంధం బాగా పెరిగింది.

ఎమ్మెల్యేగా కళ్యాణ్ రామ్

ఎమ్మెల్యేగా కళ్యాణ్ రామ్

కళ్యాణ్ రామ్ ప్రస్తుతం రెండు చిత్రాలతో నటిస్తున్నాడు. ఉపేంద్ర మాధవ్ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ఎమ్మెల్యే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. కళ్యాణ్ రామ్ నటిస్తున్న మరో చిత్రం నా నువ్వే. ఈ చిత్రం జయేంద్ర దర్శకత్వం లో రూపొందుతోంది. తమన్నా ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.

ఎమ్మెల్యే గురించి అంతటా పాజిటివ్ బజ్

ఎమ్మెల్యే గురించి అంతటా పాజిటివ్ బజ్

ఎమ్మెల్యే చిత్రం గురించి అంతటా పాజిటివ్ బజ్ నెలకొని ఉంది.ఈ చిత్ర టీజర్ కూడా ఆకట్టుకుంది. పొలిటికల్ డ్రామా నేపథ్యంలో ఈ చిత్రం ఉండబోతోంది. చిత్ర యూనిట్ విడుదల చేసిన పోస్టర్స్, స్టిల్స్ ని పరిశీలిస్తే కాజల్, కళ్యాణ్ రామ్ మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరినట్లు కనిపిస్తుంది.

 విడుదల ఈనెలలోనే

విడుదల ఈనెలలోనే

ఎమ్మెల్యే చిత్రం మార్చ్ 23 ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతోంది. కాగా 17 వ తేదీ భారీ స్థాయిలో ఆడియో వేడుక నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు.

అన్న కోసం అమెరికా నుంచి

అన్న కోసం అమెరికా నుంచి

మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం ఈ చిత్ర ఆడియో వేడుకకు ఎన్టీఆర్ హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అమెరికా లాస్ ఏంజెల్స్ లో ఉన్న ఎన్టీఆర్ ఆడియో వేడుక కోసం త్వరలోనే హైదరాబాద్ తిరిగి వస్తాడని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావలసి ఉంది. సోదరుడి ఆడియో వేడుకకు ఎన్టీఆర్ హాజరైతే అభిమానులకు పండగే.

English summary
NTR to grace MLA audio launch event. Audio launch will be held on March 17th
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu