»   »  పవన్ మరోసారి తండ్రి కాబోతున్నాడు: అన్నా లెజ్ఞోవా మళ్ళీ గర్భం దాల్చిందా?

పవన్ మరోసారి తండ్రి కాబోతున్నాడు: అన్నా లెజ్ఞోవా మళ్ళీ గర్భం దాల్చిందా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్సనల్ లైఫ్ కి సంబంధించి ఆ మధ్య తెగ చర్చ జరిగింది... అయితే సినిమా వాళ్లకు ఇవన్నీ మాములే అనుకుని సరిపెట్టుకున్న జనాలు దీనిని పెద్దగా పట్టించుకోవడం మానేసారు... పొలిటికల్ గా తప్ప పర్సనల్ గా పవన్ మీద చర్చిన్చుకోవట్లేదు జనాలు. అయితే ప్రస్తుతం ప్రముఖ సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ గురించి ఓ ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది. అయితే ఆ వార్త సారంశం ఏంటంటే పవన్ కల్యాణ్ మరోసారి తండ్రి కాబోతున్నాడనేదే ఆ వార్త.

Pawan Kalyan to become a father for the fourth time

రేణూ దేశాయ్ ని వివాహం చేసుకున్న పవన్ .. అకీరా, ఆద్య అనే ఇద్దరు చిన్నారులకి తండ్రి అయ్యాడు . ఆ తర్వాత రేణూతో విడాకులు తీసుకొని రష్యన్ లేడి అన్నా లెజీనావొని మూడో పెళ్ళి చేసుకున్నాడు పవన్. వీరికి పొలేనా అనే పాప ఉంది. అయితే రీసెంట్ గా అన్నా ఓ షాపింగ్ మాల్ లో బేబి బంప్ తో కనిపించిందని, దీంతో పవన్ మరోసారి తండ్రి కాబోతున్నాడంటూ టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది.

అంతే కాదు డాక్టర్లు అక్టోబర్ 14న డెలివరీ డేట్ అంచనాగా ఇచ్చారని వినికిడి.ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమా షూట్ లో బిజీగా వున్న పవన్ యాభై రోజుల విదేశీ షూట్ కూడా చేయాల్సి వుంది. ఆ షెడ్యూలు మధ్యలోనే ఈ అక్టోబర్ 14 డేట్ వుంది. అందుకే అవసరం అయితే తాను అక్టోబర్ 14 వేళకు కాస్త ముందుగా షూటింగ్ ఆపి వెనక్కు వస్తానని, రెండు మూడు రోజులు గ్యాప్ తీసుకుని మళ్లీ షూట్ లో పాల్గొంటానని పవన్ ముందే యూనిట్ కు చెప్పినట్లు తెలుస్తోంది. అంత వరకు యూనిట్ మాత్రం విదేశాల్లోనే వుంటుంది.

English summary
Pawan Kalyan to become a father for the fourth time, wife Anna Lezhneva pregnant?
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu