»   » మెగా ఫుడ్ పార్క్, నేసన్ : పవన్ కళ్యాణ్ సినిమా దారితప్పనుందా?

మెగా ఫుడ్ పార్క్, నేసన్ : పవన్ కళ్యాణ్ సినిమా దారితప్పనుందా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం 'కాటమరాయుడు' సినిమా చేస్తున్నాడు. అయితే ఎప్పటిలాగే ఈ సినిమా కూడా అనుకున్న సమయానికి రిలీజ్ అయ్యే అవకాశాల్లేవని, సర్దార్ గబ్బర్ సింగ్ మాదిరిగానే ఈ సినిమా కూడా చాలా లేట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయనే ప్రచారం జరుగుతోంది.

అందుకు చాలా రకాల కారణాలు వినిపిస్తున్నాయి. కాటమరాయుడు సినిమా ఇంకా పూర్తి కాలేదు.... మరో వైపు ప‌వ‌న్ క‌ల్యాణ్ కొత్త సినిమా ద‌స‌రా సంద‌ర్భంగా లాంఛ‌నంగా మొద‌లైంది. పవన్ కొత్త సినిమాకు సూర్య మూవీస్ అధినేత ఎ.ఎం.ర‌త్నం ఈ చిత్ర స‌మ‌ర్ప‌కుడుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. జిల్లా చిత్రాన్ని డైరెక్ట్ చేసిన ఆర్‌.టి.నేస‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఎస్‌.ఐశ్వ‌ర్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు.


ఈ సినిమాకి డిసెంబ‌రు నుండి డేట్స్ ఇచ్చినట్లు సమాచారం. డిసెంబ‌రులో 15 రోజులు షూటింగ్ జ‌రిపి.. జ‌న‌వ‌రిలో నిర‌వ‌ధికంగా రెండు షెడ్యూల్స్ తో ముగించాల‌ని ప్లాన్ చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది.


పవన్ కెరీర్లో తొలిసారి

పవన్ కెరీర్లో తొలిసారి

కాటమరాయుడు సినిమా షూటింగ్ పూర్తి కాకుండానే పవన్ కళ్యాణ్ నేసన్ దర్శకత్వంలో సినిమాకు డేట్స్ ఇవ్వడం హాట్ టాపిక్ అయింది. పవన్ కెరీర్లో ఓ సినిమా పూర్తి కాకముందే మరో సినిమా మొదలు కావడం ఇదే తొలిసారి.


కాటమరాయుడు సంగతేంటి?

కాటమరాయుడు సంగతేంటి?

పవన్ కళ్యాణ్ ఇష్టపడి చేసిన సర్దార్ గబ్బర్ సింగ్ బాక్సాఫీసు వద్ద ఫెయిల్ అయిన సంగతి తెలిసిందే. దాని నష్టాలను పూడ్చి నిర్మాతను గట్టెక్కించడానికి పవన్ కళ్యాణ్ కాటమరాయుడు సినిమా మొదలు పెట్టినప్పటికీ ఆ సినిమాపై ఇంట్రస్టుగా లేడనే గుసగుసలు వినిపిస్తున్నాయి.


అందుకే మరో సినిమా మొదలెట్టాడా?

అందుకే మరో సినిమా మొదలెట్టాడా?

ఇటీవలే పవన్ కళ్యాణ్ కాటమరాయుడు సెట్స్‌లోకి ఎంటరయ్యాడు. ఆయపై ఇంకా కనీసం 5 % సీన్లు కూడా చిత్రీకరించలేదు. పవన్ తీరు చూస్తుంటే ముందు నేసన్ దర్శకత్వంలో సినిమా పూర్తి చేసి తర్వాత ఎప్పుడైనా ఖాలీగా ఉన్న సమయంలో కాటమరాయుడు సినిమాను పూర్తి చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.


టార్గెట్ మెగా ఫుడ్ పార్క్

టార్గెట్ మెగా ఫుడ్ పార్క్

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలపై బాగా ఫోకస్ పెట్టారు. ఇటీవల కాలంలో ఏపీలోని పలు ప్రాంతాల్లో పొలిటికల్ సభలు పెట్టి దడదడలాండించారు. గతంలో రాజధాని రైతుల భూముల విషయంలో పోరాటం చేసిన పవన్...ఆ సమయంలో కొంత కాలంపాటు తన సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాను సైతం పక్కన పెట్టారు. తాజాగా పవన్ కళ్యాణ్ భీమవరం సమీపంలో నిర్మిస్తున్న గోదావరి ఆక్వా మెగా ఫుడ్ పార్క్ ను టార్గెట్ చేసాడని అంటున్నారు.


మెగా ఫుడ్ పార్క్ మీద పోరాటం

మెగా ఫుడ్ పార్క్ మీద పోరాటం

భీమవరం సమీపంలో నిర్మిస్తున్న గోదావరి ఆక్వా మెగా ఫుడ్ పార్క్ వల్ల సమీపంలోని దాదాపు 30 గ్రామాలు నష్టపోయే అవకాశం ఉందని, మెగా ఫుడ్ పార్క్ పొల్యూషన్ వల్ల మత్స్యాకారులు ఉపాది కోల్పోయే ప్రమాదం ఉందంటూ..... ఆయా గ్రామాల వారు పవన్ కళ్యాణ్ ను ఆశ్రయించి దానికి వ్యతిరేకంగా తాము జరిపే పోరాటానికి మద్దతు ఇవ్వాలని కోరారు. వారిక అండగా ఉంటానని పవన్ కళ్యాణ్ మాట ఇచ్చినట్లు సమాచారం.


సినిమా ఆలస్యం

సినిమా ఆలస్యం

పవన్ కళ్యాణ్ మాట ఇస్తే తప్పేరకం కాదు... ఇలాంటి పోరాట కార్యక్రమాల్లోకి ఎంటరయ్యాడంటే సినిమా షూటింగులన్నీ పక్కన పెట్టేస్తారు. ఈ ప్రభావానికి మొదట గురయ్యేది ‘కాటమరాయుడు' సినిమా అనే అంటున్నారు. మొత్తానికి ‘కాటమరాయుడు' సినిమా దారితప్పడం ఖాయంగా కనిపిస్తోంది.


వేరే కారణం చెబుతున్న టీం

వేరే కారణం చెబుతున్న టీం

అయితే కాటమరాయుడు సినిమా యూనిట్ టీం మాత్రం.... ఆలస్యానికి కారణం హీరోయిన్ శృతి హాసన్ డేట్స్ అడ్జెస్ట్ కాక పోవడమే అని చెబుతున్నారట.


English summary
Film star and president of Jana Sena Party Pawan Kalyan is back to movies and is busy shooting for Katamarayudu. But now, Pawan has a new political mission help out the victims of the Godavari Aqua Mega Food Park which is under construction in Bhimavaram.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu