పవన్ కళ్యాణ్ కొత్త చిత్రం టైటిల్ ఏంటంటే...
పవన్ కళ్యాణ్, వెంకటేష్ లతో మల్టీస్టారర్ గా తీయనున్న చిత్రానికి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే టైటిల్ ని పెట్టటానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. కొత్త బంగారులోకం దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించే ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించనున్నారు. ప్రస్తుతం ఇందుకోసం స్క్రిప్టు వర్క్ జరుగుతోంది. ఆ మధ్యన గోదావరి ఒడ్డున రాముల వారి సన్నిధిలో భద్రాచలంలోనే చిత్రీకరించేందుకు, లోకేషన్లు పరిశీలించేందుకు శ్రీకాంత్ అడ్డాల భద్రాచలం వెళ్ళి వచ్చారు. సీతారాముల కల్యాణ వేదిక, ఆలయం తదితర పరిసర ప్రాంతాల్లో తీసే సన్నివేశాలను తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. ఇక ఈ కాంబినేషన్ లాగానే టైటిల్ కూడా మంచి క్రేజ్ తెచ్చే అవకాశం ఉందంటున్నారు. ప్రస్తుతం వెంకటేష్..ఆప్త రక్షక రీమేక్ లో బిజీగా ఉన్నారు. అలాగే పవన్ కళ్యాణ్..పులి కి ఫినిషింగ్ టచెస్ ఇస్తున్నారు.
పవన్ కల్యాణ్ వెంకటేష్ పులి శ్రీకాంత్ అడ్డాల భద్రాచలం ఆర్త రక్షక కొత్త బంగారులోకం pawan kalyan venkatesh srikanth addala bhadrachalam puli


Click it and Unblock the Notifications