»   » ‘అజ్ఞాతవాసి’ రిజల్టు దెబ్బ పోలండ్ బుజ్జిగాడిపై పడిందా?

‘అజ్ఞాతవాసి’ రిజల్టు దెబ్బ పోలండ్ బుజ్జిగాడిపై పడిందా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'అజ్ఞాతవాసి' సినిమా విడుదల నేపథ్యంలో కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో పోలండ్ బుజ్జిగాడు హడావుడి చేస్తున్న సంగతి తెలిసిందే. పవర్ స్టార్ పాడిన 'కొడకా కోటేశ్వర రావు' పాటను ఈ 8 ఏళ్ల కుర్రాడు ముద్దు ముద్దుగా పాడటం తెలుగు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంది. పోలండ్ బుజ్జిగాడు పాడిన పాటను అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేశారు. చివరకు పవన్ కళ్యాణ్ కూడా బుజ్జిగాడి పాటకు స్పందించారు, థాంక్స్ చెప్పారు.

పోలెండ్ బుజ్జిగాడికి పవన్ రిప్లై..!
పిఎస్‌పికె(25) ఆంథెమ్ విడుదల చేసిన బుజ్జిగాడు

పిఎస్‌పికె(25) ఆంథెమ్ విడుదల చేసిన బుజ్జిగాడు

పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలను ప్రస్తావిస్తూ..... పోలండ్ బుజ్జిగాడు ‘పిఎస్‌పికె(25) ఆంథెమ్' పేరుతో సొంత కంపోజిషన్‌తో ఓ పాట పాడారు. వచ్చి రాని తెలుగు పలుకులు పలుకుతూ ఈ పోలండ్ బుజ్జిగాడి పాట వినడానికి వినసొంపుగా ఉందని చెప్పలేం కానీ..... ఆ బుజ్జిగాడి వయసుతో పోలిస్తే బాగానే చేశాడని మెచ్చుకోక తప్పదు.


 పట్టించుకోని పవర్ స్టార్ అభిమానులు

పట్టించుకోని పవర్ స్టార్ అభిమానులు

బుజ్జిగాడు పాడిన ఈ పాట మంగళవారం విడుదలైంది. అయితే నిన్నంతా అభిమానులు ‘అజ్ఞాతవాసి' సినిమా టిక్కెట్ల హడావుడిలోనే ఉండటంతో పెద్దగా రెస్పాన్స్ రాలేదు.


 నిరాశలో పవర్ స్టార్ ఫ్యాన్స్

నిరాశలో పవర్ స్టార్ ఫ్యాన్స్

ఎన్నో అంచనాలతో వచ్చిన ‘అజ్ఞాతవాసి' సినిమా అంచనాలను అందుకోలేక పోయింది. సినిమా చూసిన ప్రేక్షకుల్లో ఎక్కువ మంది అసంతృప్తితోనే బయటకు వస్తున్నారు. మరో వైపు మీడియా రివ్యూలు కూడా సినిమా బిలో యావరేజ్ అని తేల్చేశాయి. దీంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ నిరాశలో పడిపోయారు. ఈ పొజిషన్లో వారు బుజ్జిగాడి పాటను పట్టించుకునే అవకాశం లేదు.


పాపం బుజ్జిగాడు

ఇలాంటి సమయంలో విడుదల కావడంతో..... పాపం ఈ బుజ్జిగాడి పాటను ఎవరూ పట్టించుకునేట్లు కనిపించడం లేదు. ఒక వేళ ‘అజ్ఞాతవాసి' సినిమా సూపర్ హిట్ టాక్‌ వచ్చి ఉంటే ఆ ఆనందంలో ‘బుజ్జిగాడు పాడిన పవర్ స్టార్ ఆంథెమ్‌ను కూడా అభిమానులు మారుమ్రోగించేవారు.


 కొడకా పాటతో తెరపైకి బెజ్జిగాడు

కొడకా పాటతో తెరపైకి బెజ్జిగాడు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'అజ్ఞాతవాసి' సినిమాలో కొడకా కోటేశ్వర్ రావు అనే పాట పాడిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 31న సాయంత్రం ఈ పాట విడుదలవ్వగా ఇప్పటికే 8.3 మిలియన్ హిట్స్ వచ్చాయి. అయితే ఈ పాటను యూకెలో ఉంటున్న పోలండ్ బుజ్జిగాడు పాడటం సోషల్ మీడియాలో వైరల్ అయింది. అసలు తెలుగు తెలియని 8 ఏళ్ల జెబిగ్స్ బుజ్జి అనే కుర్రాడు ముద్దు ముద్దుగా ఆ పాట పాడటం అందరినీ ఆకట్టుకుంది.


బుజ్జిగాడు మన హైదరాబాద్ పోరగాడు

బుజ్జిగాడు మన హైదరాబాద్ పోరగాడు

ఈ బుజ్జిగాడు ఎవరోకాదు...హైదరాబాద్ పోరగాడే. బుజ్జి తండ్రి శరత్ 20 ఏళ్ల క్రితం హైదరాబాద్ నుండి యూరఫ్ వెళ్లాడు. పోలండ్ కు చెందిన యూలాను పెళ్లాడి అక్కడే సెటిలైపోయాడు. ఈ దంపతులకు పుట్టిన పిల్లాడే ఈ బుజ్జిగాడు.


అతడిలో టాలెంట్ గమనించిన తండ్రి

అతడిలో టాలెంట్ గమనించిన తండ్రి

శరత్ తన కొడుకులో సింగింగ్ కు సంబంధించిన టాలెంట్ ఉందని గుర్తించాడు రెండున్నరేళ్లకే స్పానిష్ పాటలు వినడం, వాటిని పాడటానికి ప్రోత్సహించడాన్ని చూసి తండ్రి బాగా ప్రోత్సహించాడు. తెలుగు పాటలు కూడా నేర్పించాడు.


కర్నాటక సంగీతం, తెలుగు భాష నేర్చుకుంటున్నాడు

కర్నాటక సంగీతం, తెలుగు భాష నేర్చుకుంటున్నాడు

ప్రస్తుతం బుజ్జిగాడు కర్నాటక సంగీతం నేర్చుకోవడంతో పాటు, తెలుగు భాష నేర్చుకోవడంలో బుజ్జి బిజీగా ఉన్నాడు. త్వరలో సినిమాల్లోకి కూడా వస్తున్నాడట.


English summary
This is the Official "PSPK(25) ANTHEM" Full Song tribute to Powerstar Pawan Kalyan from his die hard 8 year old fan Zbigsbujji from Poland. The Poland Boy Zbigsbujji sang this special song for powerstar pawan kalyan to show his unconditional love towards pawan kalyan.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X