»   » తమిళ డైరక్టర్ తో ప్రభాస్‌తో నెక్ట్స్ సినిమా?

తమిళ డైరక్టర్ తో ప్రభాస్‌తో నెక్ట్స్ సినిమా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రభాస్ తన కొత్త చిత్రానికి దర్శకుడుగా తమిళ డైరక్టర్ సముద్ర ఖనిని ఎంచుకునే అవకాశం ఉందని సమాచారం. సముద్ర ఖని సంక్రాంతికి విడుదలైన “శంభో శివ శంభో" (రవితేజ, అల్లరి నరేష్, శివబాలాజి) చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయ్యారు. సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకున్నా మంచి డైరక్టర్ అనే పేరు తెచ్చుకున్నాడు. అయితే ఈ విషయమై ప్రభాస్ ని ఇంకా తాను సంప్రదించకపోయినప్పటికీ, ప్రభాస్ తన స్క్రిప్ట్ ని మెచ్చుకుంటాడని ధీమా వ్యక్తం చేస్తున్నాడు సముద్రఖని. ప్రభాస్ కనుక ఓకే చేస్తే తెలుగు, తమిళ భాషల్లో ఒకే సారి ఈ సినిమాని తెరకెక్కిస్తాను అని అంటున్నారు.అంటే అన్నీ అనూకూలిస్తే ప్రభాస్ తమిళ్ లో ఈ చిత్రంతో తమిళంకు కూడా పరిచయం అవుతాడు అన్నమాట. తమిళ నవల 'శివం" ఆధారంగా తాను ఈ కథను రూపొందిస్తున్నట్టు సముద్రఖని వెల్లడించాడు. ప్రస్తుతం ప్రభాస్ దశరధ్ దర్శకత్వంలో దిల్ రాజు చిత్రంలో చేస్తున్నారు. అలాగే కరుణాకరన్ దర్శకత్వంలో రూపొందిన డార్లింగ్ చిత్రం రిలీజ్ కు రెడీ గా ఉంది. ఈ రెండు చిత్రాల అనంతరం రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ ఓ చిత్రం చేసే అవకాశం ఉంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu