»   » సునీల్ ఎదగకుండా తొక్కేస్తున్న నిర్మాత, ఎందుకు అంత కక్ష?

సునీల్ ఎదగకుండా తొక్కేస్తున్న నిర్మాత, ఎందుకు అంత కక్ష?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు సినీ పరిశ్రమలో వివాదాలకు దూరంగా ఉండే హీరోల్లో సునీల్ ఒకరు. కామ్ గా తన సినిమాలు తాను చేసుకుంటూ వెళ్లే సునీల్... ఓ నిర్మాత కారణంగా కెరీర్ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ మధ్య అసలే సరైన హిట్టులేక ఇబ్బంది పడుతున్న సునీల్‌ను ఓ ప్ర‌ముఖ నిర్మాత తొక్కేసే ప్రయత్నం చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియాలో ఈ విషయం హాట్ టాపిక్ అవుతోంది. మరి ఆ నిర్మాతకు, సునీల్ కు మద్య ఏం జరిగిందో? ఎందుకు సదరు నిర్మాత ఇలా చేస్తున్నాడనేది అర్థం కావడం లేదు.

సునీల్ నటించిన...జ‌క్క‌న్న పెద్దగా ఆడలేదు. అయితే ఓ ఛానెల్ ఈ సినిమాను కొంత మొత్తానికి కొనుగోలు చేసేందుకు ఒప్పుకుంది. అయితే సునీల్ ను తొక్కేసే ప్రయత్నంలో ఉన్న ఆ నిర్మాత ఆ ఛానల్ ఆ సినిమాను కొనకుండా డీల్ క్యాన్సిల్ అయ్యేలా చేసాడట.

ఎందుకు అలా చేస్తున్నాడు?

ఎందుకు అలా చేస్తున్నాడు?

సునీల్ నటించిన కృష్ణాష్టమి, జక్కన్న, ఈడు గోల్డ్ ఎహే సినిమాల ప్రచారం సందర్భంగా కూడా కొన్ని చానెళ్లకు, ఎఫ్ఎమ్‌లకు కూడా ఓ నిర్మాత ఫోన్లు చేసి... ప్రచారం పెద్దగా జరుగకుండా అడ్డుకునే ప్రయత్నం చేసారట. అయితే ఆ నిర్మాత ఇండస్ట్రీలో పెద్ద నిర్మాత కావడంతో అతడి పేరును బయట పెట్టడానికి సునీల్ గానీ, చిత్ర యూనిట్ సభ్యులు బయట పెట్టడానికి ఇష్టడటం లేదు.

కులం వల్లే ఎదిగావా? అన్నారు, చంపేస్తానన్నా: హీరో సునీల్ వివరణ

కులం వల్లే ఎదిగావా? అన్నారు, చంపేస్తానన్నా: హీరో సునీల్ వివరణ

కులం వల్లే ఎదిగావా? అన్నారు, చంపేస్తానన్నా అంటూ ...... హీరో సునీల్ వివరణ ఇచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేనయండి

‘ఈడు గోల్డ్ ఎహే’ తో నిరాశపరిచా, క్షమించండి అంటూ...

‘ఈడు గోల్డ్ ఎహే’ తో నిరాశపరిచా, క్షమించండి అంటూ...

ఈడు గోల్డ్ ఎహే చిత్రాన్ని మెచ్చిన వాళ్లకు థ్యాంక్స్. ఈ సినిమాతో నిరాశ పరిచినందుకు మాత్రం మన్నించమని కోరుతున్నా. ఆత్మ పరిశీలన చేసుకుని.. ఈసారి స్క్రిప్టు విషయంలో మరింత అప్రమత్తంగా ఉంటాను... అంటూ దర్శకుడు వివరణ ఇచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

పవన్ కళ్యాణ్‌ జనసేన పార్టీకి మద్దతిస్తూ సునీల్ ప్రకటన!

పవన్ కళ్యాణ్‌ జనసేన పార్టీకి మద్దతిస్తూ సునీల్ ప్రకటన!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘జనసేన పార్టీ'కి మద్దతు ఇవ్వడానికి, పవన్ కళ్యాణ్ తరుపున పని చేయడానికి తాను సిద్ధమే అని ప్రముఖ కమెడియన్, హీరో సునీల్ అన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

English summary
Tollywood Producer troubles actor Sunil. Sunil Varma is an Indian actor from the Telugu film industry. His roles usually are to provide comic relief to the audience. Varma has won two Filmfare Awards and three Nandi Awards.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu