ప్చ్...మరో పెద్ద సినిమా సంక్రాంతి బరి నుంచి అవుట్
హైదరాబాద్ : వచ్చే నెలలో వచ్చే సంక్రాంతికి సినీ ప్రియులకు పండుగ జరుగుతుందనుకుంటూంటే...ఒక్కో సినిమా బరి నుంచి తప్పుకుంటున్నాయి. తాజాగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నితిన్ హీరోగా రూపొందుతున్న 'హార్ట్‌ఎటాక్' చిత్రం సైతం సంక్రాంతి బరి నుంచి తప్పుకుని నిరాశపరిచింది. ఈ చిత్రం మొదట జనవరి 15,2014 విడుదల అనుకున్నారు. కానీ పరిశ్రమలో చెప్పకోబడుతున్న తాజా సమాచారం ప్రకారం..ప్యాచ్ వర్క్ ఇంకా కంప్లీట్ కాలేదని, పిభ్రవరి 14 వాలెంటైన్స్ డే రోజున విడుదల చేద్దామని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే అఫీషియల్ గా ఈ విషయమై ప్రకటన రాలేదు.
నిర్మాత మాట్లాడుతూ... ''మాస్, క్లాస్ అంశాలు మేళవించిన ప్రేమ కథ ఇది. నితిన్ గెటప్, ఆయన పాత్ర చిత్రణ ఆకట్టుకొంటాయి. స్పెయిన్‌లో చిత్రీకరించిన సన్నివేశాలు ఆకర్షణగా నిలుస్తాయి. అనూప్ రూబెన్స్ అందించిన పాటలు యువతరాన్ని అలరిస్తాయనే నమ్మకం ఉంది'' అని చెప్తున్నారు. ప్రేమ కథలు తెరకెక్కించడంలో పూరి జగన్నాథ్‌ది ప్రత్యేక శైలి. అందులోనే వినోదం, పోరాట దృశ్యాలు ఉండేలా జాగ్రత్త పడతారు. ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'హార్ట్‌ఎటాక్'. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ సంస్థ తెరకెక్కిస్తోంది. నితిన్ సరసన ఆదా శర్మ హీరోయిన్ .

నితిన్ ఈసినిమాపై ఎంతో నమ్మకంగా ఉన్నాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటించాలనే కోరిక ఎప్పటి నుండో ఉంది. ఇప్పటికి ఆ కోరిక నెరవేరబోతోంది. పూరిగారు కథ చెప్పగానే ఎప్పుడెప్పుడు ఈ షూటింగ్ మొదలవుతుందా అని ఆసక్తి నాలో మొదలైంది. ఈ సినిమా నా కెరీర్‌కు ఎంత ముఖ్యమైనదిగా భావిస్తున్నానని అంటున్నాడు నితిన్.అనూప్ రూబెన్స్ ఈచిత్రానికి సంగీతం అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











