»   » ఎన్టీఆర్, రాఘవేంద్రరావు కాంబినేషన్ ..పౌరాణికం

ఎన్టీఆర్, రాఘవేంద్రరావు కాంబినేషన్ ..పౌరాణికం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఎన్టీఆర్ చేస్తున్నాడా అంటే అవుననే వినిపిస్తోంది. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌లాంటి సీనియర్‌ హీరోలతో సినిమాలు తీసిన ఆయన మహేష్‌బాబు, అల్లు అర్జున్‌, నితిన్‌లాంటి నేటితరంతోనూ చిత్రాలు తీసి విజయాల్ని అందుకొన్నారు.

ప్రస్తుతం నాగార్జున ప్రధాన పాత్రధారిగా 'ఓం నమో వేంకటేశాయ' చిత్రాన్ని తెరకెక్కిస్తున్న ఆయన .... తదుపరి విజువల్‌ ఎఫెక్ట్స్‌కి ప్రాధాన్యమున్న ఓ కథని సిద్ధం చేసుకొన్నట్టు సమాచారం. భారీ వ్యయంతో తెరకెక్కనున్న ఆ కథని ఎన్టీఆర్‌ హీరోగా తెరకెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట కె.రాఘవేంద్రరావు.

రెండేళ్ల తర్వాత ఆ చిత్రాన్ని ప్రారంభించొచ్చని తెలిసింది. పౌరాణిక గాథతోగానీ లేదంటే సోషియో ఫాంటసీ కథతోగానీ ఆ చిత్రం తెరకెక్కొచ్చని సమాచారం. ఈ విషయమై రీసెంట్ గా రాఘవేంద్రరావు, ఎన్టీఆర్ మధ్య చర్చలు జరిగాయని చెప్తున్నారు. ఓ అద్బుతమైన ప్రాజెక్టుగా ఎన్టీఆర్ తో తెరకెక్కించాలని ఆయన భావిస్తున్నారట.

RAGHAVENDRA RAO WITH JUNIOR NTR

అద్భుతమైన చిత్రాలను తెరకెక్కిస్తూ దర్శకేంద్రుడిగా పేరుపొందిన కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో నటిస్తున్న భక్తిరస చిత్రం 'ఓం నమోవెంకటేశాయ'. వెంకటేశ్వరస్వామి గుడి సెట్ వేసి, అక్కడ షూటింగ్ చేస్తున్నారు.

ఆధ్యాత్మిక చిత్రాల్ని కె.రాఘవేంద్రరావు ఎంతో నిష్టతో యజ్ఞంలా భావించి తెరకెక్కిస్తుంటారు. 'ఓం నమో వెంకటేశాయ' కోసం అంతే శ్రద్ధతో రంగంలోకి దిగారు. ఈ సందర్బంగా ఆయన కొన్ని రూల్స్ అప్లై చేస్తున్నారు. యూనిట్లో ప్రతీ మెంబర్ ఈ రూల్స్ ని తప్పనిసరిగా పాటించాలని తెలసింది . నాగార్జున, కె.రాఘవేంద్రరావు కలయిక అనగానే 'అన్నమయ్య', 'శ్రీరామదాసు', 'శిరిడిసాయి' లాంటి భక్తి ప్రధానమైన చిత్రాలే గుర్తుకొస్తాయి. ఇకపై ఆ జాబితాలోకి 'ఓం నమో వెంకటేశాయ' కూడా చేరనుంది.

English summary
Director Raghavendra Rao is also waiting to make movie with NTR. It could by mythological also. It is like both are waiting for each other.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu