»   » లక్ష్మి మంచు దర్శకుడుతో రాజ్ తరుణ్ నెక్ట్స్

లక్ష్మి మంచు దర్శకుడుతో రాజ్ తరుణ్ నెక్ట్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: వరసగా నాలుగు హిట్స్ ( 'ఉయ్యాల జంపాల', 'సినిమా చూపిస్త మావా', 'కుమారి 21F', 'ఈడో రకం ఆడో రకం') కొట్టిన హీరో రాజ్ తరుణ్. ఫన్ తో కలిసిన కథలకు తనదైన యాసను కలిపి డిఫెరెంట్ మ్యానరజంలతో చక్కటి ఈజ్ తో దూసుకుపోతున్న రాజ్ తరుణ్ కథల విషయంలో కూడా విభిన్నత చూపాలనుకుంటున్నాడు.

అందులో భాగంగా తను ఇప్పటివరకూ చేయని క్రైమ్ కామెడీ సినిమాని చేయటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ సినిమాకు 'దొంగాట' ఫేమ్ వంశీ కృష్ణ దర్శకత్వం వహించబోతున్నట్లు తెలుస్తోంది. మంచులక్ష్మి తో చేసిన దొంగాట చిత్రం అప్పట్లో మంచి విజయం సాధించింది. ఆ తర్వాత ఆ దర్శకుడు అవకాశాలు అయితే రాలేదు. దాంతో ఆయన ఇన్నాళ్లకు రాజ్ తరుణ్ ని డిఫెరెంట్ గా ట్రీట్ చేసిన కథతో ఒప్పించినట్లు తెలుస్తోంది.

Raj Tarun’s next with Dongata Director?

బౌండెడ్ స్క్రిప్టు తో కలిసిన వంశీకృష్ణ చెప్పిన కథ బాగా నచ్చడంతో రాజ్ తరుణ్ ఈ సినిమా చేయడానికి అంగీకరించినట్టు తెలిసింది. క్రైమ్ కామెడీ గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో రాజ్ తరుణ్ పూర్తిగా కొత్తగా ప్రెజెంట్ చేస్తారని సమాచారం. ప్రస్తుతం దర్శకుడు వంశీకృష్ణ ఈ సినిమా డైలాగ్ వెర్షన్ రెడీ చేస్తున్నట్లు తెలిసింది. అలాగే రాజతరుణ్ సైతం ఈ స్క్రిప్టులో పాలుపంచుకున్నట్లు చెప్తున్నారు. త్వరలో ఈ సినిమా గురించి ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

English summary
Raj Tarun has teamed up with young filmmaker Vamsi Krishna, who made his directorial debut with a crime comedy titled Dongata starring Manchu Lakshmi, for his next film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu